/rtv/media/media_files/2025/03/13/WRiwK19uwtxcgDdAx3Y4.jpg)
tamil stalin Photograph: (tamil stalin)
Tamil Nadu: తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హిందీ వ్యతిరేకతలో భాగంగా బడ్జెట్‌లో రూపాయి సింబల్ మార్చేసింది. దాని స్థానంలో తమిళనాడులో 'రూ' అని అర్థం వచ్చే అక్షరాన్ని చేర్చారు. తమిళ సంఘాలు ఈ నిర్ణయాన్ని స్వాగతించగా జాతీయ చిహ్నాన్ని తక్కువ చేసి చూపించారని మరికొందరు మండిపడుతున్నారు.
Tamil Nadu government replaces the Rupee symbol with a Tamil language symbol representing the same on its Tamil Nadu Budget 2025-26. The previous Budget carried the Indian currency symbol ₹. #TamilNadu #MKStalinGovt #HindiImposition #Tamil #TamilNaduBudget #DMK #AIADMK pic.twitter.com/b2GBCkJSc7
— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) March 13, 2025
మూడు భాషలెందుకు..
మాతృభాషను కాపాడుకొనేందుకు తీసుకొన్న చర్య నిజంగా అద్భుతమని తమిళ సంఘాలు పొగిడేస్తుంటే.. జాతీయ చిహ్నాన్ని తక్కువ చేసి చూపించారని మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఈ నిర్ణయంపై స్పందించిన స్టాలిన్.. ‘తమిళనాడు విద్యార్థులు మూడో భాష నేర్చుకునేందుకు ఎందుకు నిరాకరిస్తున్నారని కొంతమంది మమ్మల్ని అడుగుతున్నారు. కానీ నార్త్ ఇండియాలో మూడో భాష కింద ఏ భాష నేర్పిస్తున్నారో చెప్పట్లేదు. అక్కడ రెండు భాషలు మాత్రమే బోధిస్తుంటే.. దక్షిణాదిలో మాత్రం మూడు భాషలను నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది' అని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: ప్రైవేట్ భాగంలో దురద రాకుండా ఉండటానికి ఇలా చేయండి
మరోవైపు పాఠశాల విద్యార్థులు 3 భాషలు నేర్చుకోవాలని NEP-2020 సిఫార్సు చేస్తోంది. ఇందులో రెండు భారతీయ భాషలు తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈ ఫార్ములా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలన్నీ పాటించాల్సిందే. కానీ విద్యార్థులకు నేర్పాల్సిన భాషలు ఏమిటనేది అంశంలో తుది నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రాలకే ఉంది. ఇందులో భాగంగానే జాతీయ విద్యావిధానంలోని కీలక అంశాలు, త్రిభాషా సూత్రాన్ని అమలు చేయనందుకే తమిళనాడుకు సమగ్ర శిక్షా అభియాన్ కింద అందించాల్సిన రూ.573 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం నిలిపేసింది. ఎన్‌ఈపీ మార్గదర్శకాలు అమలు చేసిన కేంద్రం నిధులు అందిస్తుందని నిబంధనల్లో పొందుపరిచారు.
சமூகத்தின் அனைத்துத் தரப்பினரும் பயன்பெறும் வகையில் தமிழ்நாட்டின் பரவலான வளர்ச்சியை உறுதி செய்திட…#DravidianModel #TNBudget2025 pic.twitter.com/83ZBFUdKZC
— M.K.Stalin (@mkstalin) March 13, 2025
ఇక భారత దేశంలో 22 అధికారిక భాషలున్నాయి. అయితే కరెన్సీ సింబల్ దేవనాగరి లిపిలోని ర అనే అక్షరం ‘र’ (ర) ఆధారంగా రూపొందించారు. స్థానిక భాషలకు సంబంధించి ఎలాంటి కరెన్సీ సింబల్ లేదు. కానీ సీఎం స్టాలిన్ తమ భాషలో ఉన్న ‘రు’ అక్షరాన్ని రూపీ సింబల్ ‘₹’ స్థానంలో చేర్చి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై బీజేపీ నేత కె.అన్నామలై మండిపడ్డారు. ఇది తమిళనాడు ప్రభుత్వ మూర్ఖత్వం అన్నారు.