/rtv/media/media_files/2026/04/18/pm-modi-to-chair-emergency-cabinet-meet-shortly-2026-04-18-09-14-31.jpg)
PM modi to Chair Emergency Cabinet Meet Shortly
లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు(women-reservation-bill) వీగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో డీలిమిటేషన్, కేంద్ర పాలిత ప్రాంతాల సవరణ చట్టం బిల్లులకు కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర కేబినెట్ శనివారం అత్యవసర మీటింగ్ నిర్వహించనుంది. ప్రధాని మోదీ(PM Modi) నేతృత్వంలో ఉదయం 11.30 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్‌లో తాజా రాజకీయ పరిస్థితులను సమీక్షించడం, పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: డీలిమిటేషన్ చిక్కుముడితో వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు.. బీజేపీ తొందరపడిందా ?
PM Modi To Chair Emergency Cabinet Meet
మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణలపై చర్చించే అవకాశం కూడా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ఆర్టికల్ 370 లాంటి పలు కీలక నిర్ణయాలను ఎన్డీయే ప్రభుత్వం ఇలాంటి అత్యవసర కేబినెట్ సమావేశాల్లోనే తీసుకుంది. ఈ క్రమంలోనే శనివారం నిర్వహించబోయే ఈ సమావేశంపై ఆసక్తి నెలకొంది.
Also Read: ఐటీలో ఉద్యోగులకు బిగ్ షాక్.. 3 నెలల్లోనే 80 వేల మందికి లేఆఫ్స్
మరోవైపు పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్‌కు సంబంధించిన బిల్లు వీగిపోవడంతో దీనికి గల కారణాలపై ఎన్డీయే కూటమి ఇప్పటికే సమీక్ష నిర్వహించింది. శుక్రవారం రాత్రి లోక్‌సభలో ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత NDA కూటమి నేతలు సమావేశమయ్యారు. బీజేపీ తరఫున కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అర్జున్ రాం, మేఘ్వాల్, ధర్మేంద్ర ప్రధాన్‌తో పాటు ఇతర మిత్రపక్ష పార్టీల నేతలు ఇందులో పాల్గొన్నారు.
ఇదిలాఉండగా శుక్రవారం లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఓటింగ్ జరిగింది. ఇందులో 528 మంది ఎంపీలు పాల్గొనగా అనుకూలంగా 298 మంది ఓటువేశారు. వ్యతిరేకంగా 230 మంది సభ్యులు ఓటేశారు. బిల్లు అమలు కావాలంటే కనీసం 352 ఓట్లు కావాల్సి ఉండగా కేంద్రం ఈ మార్కును చేరుకోలేకపోయింది. దీంతో మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ అమలుకు బ్రేక్ పడినట్లయ్యింది. ఈ బిల్లు వీగిపోవడంతో డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లులను కూడా మోదీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మొత్తానికి ఈ మూడు బిల్లులకు పార్లమెంటులో ఆమోదం లభించకుండా పోయింది.
Follow Us