/rtv/media/media_files/2026/02/17/election-commission-2026-02-17-18-36-56.jpg)
Election Commission
Assembly Elections: దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. దేశంలోని 5 రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు భారత ఎన్నికల కమిషన్ (ECI(election-commission-of-india)) సిద్ధమవుతోంది. 2029లో జరిగే లోక్‌సభ సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావించే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. వచ్చే నెల (మార్చి)లోనే నగారా మోగనుంది. మార్చి నెలలో కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. మార్చి నెల మొదటి, లేదా రెండో వారంలోనే ఎన్నికలకు సంబంధించి కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
పశ్చిమబెంగాల్(west bengal), తమిళనాడు(tamilandu), కేరళ(kerala), అసోం(assam), పుదుచ్చేరి(puducherry) (కేంద్రపాలిత ప్రాంతం) రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భారత ఎన్నికల కమిషన్ (ECI) త్వరలోనే షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. నాలుగు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన ఎన్నిక(2029-elections) ల తేదీలను ఎన్నికల కమిషన్ ఒకేసారి ప్రకటించే అవకాశం ఉంది. అయితే పోలింగ్ మాత్రం ఆయా రాష్ట్రాల్లో వేర్వేరు దశల్లో నిర్వహించే అవకాశం ఉంది. ఈ మేరకు నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతాన్ని ఈ నెలలోనే ఎన్నికల సంఘం పూర్తిస్తాయి బెంచ్ సందర్శించనుంది. ఈ బెంచ్‌లో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్, ఇతర ఎన్నికల కమిషనర్లు కూడా ఉంటారన తెలుస్తోంది.
Also Read : మరీ ఇంత దిగజారిపోయారా.. ఢిల్లీ ఏఐ సమ్మిట్‌లో దొంగతనం
ముగియనున్న పదవీకాలం
కాగా ఈ నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి పదవీకాలం మే, జూన్ నెలల్లో ముగియనుంది. పుదుచ్చేరి అసెంబ్లీ గడువు జూన్ 15తో ముగుస్తుంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ గడువు మే 7తో ముగియనుంది. తమిళనాడు అసెంబ్లీ గడువు మే 10 వరకు ఉంది. అస్సాం అసెంబ్లీ గడువు మే 20 వరకు ఉంది. కేరళ అసెంబ్లీ గడువు మే 23తో ముగుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్, మే నెలల్లో జరిగాయి. ఇప్పుడు కూడా ఆయా నెలల్లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. కాగా గతంలో పశ్చిమ బెంగాల్లో ఎనిమిది దశలు. అస్సాంలో రెండు దశలు, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఒక్క దశలో ఎన్నికలు నిర్వహించారు. ఇపుడు కూడా అదే దశల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
పూర్తి దశలో ఎన్నికల ఏర్పాటు
కాగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించింది. పోలింగ్‌కు సిద్ధతను సమీక్షించేందుకు అధికార బృందాలు ఆయా రాష్ట్రాలను పర్యటిస్తున్నాయి. ప్రస్తుతం ఒక బృందం అస్సాంలో పర్యటిస్తూ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలిస్తోంది. ఎన్నికల కోసం ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ కూడా పూర్తవుతుంది. పుదుచ్చేరికి సంబంధించి ఫిబ్రవరి 14న తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది. తమిళనాడు ఫిబ్రవరి 18న (మంగళవారం) తుది జాబితా విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. కేరళ ఫిబ్రవరి 21న తుది జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్ ఫిబ్రవరి 28న ఓటర్ల తుది జాబితా విడుదల చేయనుంది. అస్సాంలో ప్రత్యేక సవరణ అనంతరం ఫిబ్రవరి 10న తుది జాబితా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా ఎన్నికల కమిషన్ అన్ని రాష్ట్రాల్లో ఏర్పాట్లు వేగవంతం చేస్తూ, సమయానికి ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతోంది. కాగా ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు సన్నద్ధత, ఓటర్ల జాబితాల వివరాలు, భద్రతా ఏర్పాట్లు, ఈవీఎం యంత్రాలు, వీవీ ప్యాట్ సాంకేతికత, ఎన్నికల సిబ్బంది ఏర్పాట్లు వంటి అంశాలను పరిశీలించడానికి పర్యటనలు మొదలు పెట్టింది. ఎన్నికల సంఘం అన్నింటినీ బేరీజు వేసుకున్నాకే మార్చి నెలలో ఎన్నికల షెడ్యూల్ విడుదలకు అవకాశం ఉంటుంది.
Also Read : నటి ప్రత్యూష కేసులో సుప్రీం సంచలన తీర్పు.. లొంగిపోవాలని ఆదేశం
ఎక్కడ ఎన్ని స్థానాలంటే?
కాగా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పశ్చిమబెంగాల్లో 294 అసెంబ్లీ స్థానాలు, తమిళనాడులో 234, కేరళలో 140, అసోంలో 126, పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా కేంద్రంలోని ఎన్డీయే కూటమి అందులోనూ ప్రధానంగా బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నది. ఉత్తరాదిలో వరుస విజయాలతో అధికార పీఠాలు అధిరోహించిన బీజేపీ దక్షిణాదిలోని తమిళనాడు, కేరళ, అటు పశ్చిమబెంగాల్లోనూ పాగా వేయాలని ప్రయత్నిస్తోంది.
Follow Us