/rtv/media/media_files/2025/02/19/6zT2wvTsnJwnhib3VWkG.jpg)
Drought In Kasmir
కాశ్మీర్ లో జనవరి, ఫిబ్రవరి నెల్లో వర్షాలు (Rains) పడతాయి. అలా పడితేనే అక్కడి నదుల్లో నీరు ఉంటుంది. అప్పుడే వారికి వేసవిలో తాగునీరుకు లోటు ఉండదు. కానీ ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలలో ఇప్పటి వరకు పెద్దగా వర్షాలు పడలేదు. ఈ లోటు 79 శాతంగా ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇలాగే పొడి వాతావరణం కొనసాగితే కాశ్మీర్ లోయవాసులకు తాగు నీటితో పాటూ సాగు జలాలకు లోటుపాట్లు తప్పవని చెప్పింది. జీలం, ఇతర నదుల్లో సాధారణ నీటి మట్టంతో పోలిస్తే ఈ ఏడాది ఒక మీటరు తక్కువ స్థాయిలో ప్రవాహం ఉందని..నీటి పారుదల శాఖ తెలిపింది. మరో 15 రోజుల్లో వర్షం లేదా మంచు పడకుంటే మరింత కష్టతరం అవుతుందని అంటున్నారు.
Also Read: Cricket: నేనప్పుడే వెళ్ళను..రిటైర్మెంట్ పై రోహిత్ క్లారిటీ
Also Read : సూడాన్‌లో దారుణం.. 200 మంది మృతి
వర్షమూ లేదు..మంచూ లేదు..
కాశ్మీర్ (Kashmir) లో ఇప్పటికే నదులు అన్నీ చాలా తక్కువ నీటితో ఉన్నాయి. దక్షిణ కాశ్మీర్ లో అయితే పూర్తిగా ఎండిపోయాయి. దీనికి సంబంధించి చాలా వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి. వర్షాలు పడకపోవడం ఒక కారణం అయితే ఈ ఏడాది పెద్దగా మంచు కూడా పడలేదు. సాధారణంగా హిమాలయాల్లో మంచు ఎక్కువగానే పడుతుంది. నవంబర్ నుంచి మార్చి వరకు ఇక్కడ పడే మంచు తర్వాత ఎండలకు కరికి నీరుగా మారుతుంది. దాని వలన కూడా నదులు నిండుతాయి. అయితే ఈ ఏడాది హిమపాతం కూడా తక్కువగానే ఉంది. అది ఇప్పటికే కరిగి నీరుగా మారిపోయింది. ఇప్పుడు మళ్ళీ పెద్దగా మంచు పడితేనే కానీ రానున్న రోజుల్లో నీరుగా మారే అవకాశం ఉండదు అని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. కానీ మంచు కురిసే పరిస్థితులు కనిపించడం లేదని చెబుతన్నారు. దీంతో కాశ్మీర్ కు కరువు తప్పదని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.
Also Read : త్వరలో క్యాన్సర్‌కు టీకా.. కేంద్రమంత్రి కీలక ప్రకటన
#WATCH | J&K | Winter chill continues in Srinagar city with minimum temperature of 0 degrees Celsius and maximum temperature of 13 degrees Celsius recorded here today, as per IMD.
— ANI (@ANI) February 17, 2025
(Visuals from the Dal Lake) pic.twitter.com/0TxBd8mYic
Also Read: Champions Trophy: మెగా సమరానికి సై..నేటి నుంచే ఛాంపియన్స్ ట్రోఫీ...