![Anurag Thakur](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2025/01/21/zGooLNbrnUWcEf8wvt3B.jpg)
Anurag Thakur
Delhi Elections: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు హామీలు వర్షం కురిపిస్తున్నాయి. ఇటీవలే బీజేపీ ఓ మేనిఫెస్టోను విడుదల చేయగా.. తాజాగా మరో మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. తాము అధికారంలోకి వస్తే నిరుపేదల విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలు చేస్తామని హామీ ఇచ్చింది. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతకు రూ.15 వేలు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటన చేసింది.
Also Read: ట్రంప్ మొదట సంతకాలు చేసిన పది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ఇవే..
మరో మేనిఫెస్టో ప్రకటించిన బీజేపీ
ఐటీఐలు, పాలిటెక్నిక్ స్కిల్ సెంటర్లలో టెక్నికల్ కోర్సులు చదవుతున్న షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు 'భీమ్‌రావ్ అంబేద్కర్ స్టైఫండ్' స్కీమ్ కింద ప్రతీనెలా రూ.1000 చొప్పున స్కాలర్‌షిప్ అందిస్తామని పేర్కొంది. అలాగే తాము అధికారంలోకి వస్తే ఆప్ ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలపై దర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఈ మేరకు 'సంకల్ప పత్రా పార్ట్-2' పేరుతో బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ రెండో మేనిఫెస్టోను విడుదల చేశారు.
Also Read: Akkineni Akhil: అఖిల్ పెళ్ళి డేట్ ఫిక్స్.. ఆరోజు నుంచి ఘనంగా పెళ్లి వేడుకలు
ఇదిలా ఉండగా.. 'సంకల్ప పత్రా పార్ట్-1' పేరుతో ఇటీవల బీజేపీ(BJP)జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా(JP Nadda) మేనిఫెస్టో ప్రకటించిన సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే గర్భిణులకు రూ.21 వేలు ఆర్థిక సాయం, పేదలకు సబ్సిడీ కింద రూ.500లకే ఎల్పీజీ సిలిండర్లు, మహిళా సమృద్ధి యోజన స్కీమ్ కింద నెలకు రూ.2500 ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
Also Read: కుంభమేళాలో అదానీ సేవ.. ప్రతి రోజు లక్ష మందికి అన్నదానం
ఇదిలాఉండగా బీజేపీ మేనిఫెస్టోపై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. అర్హులైన విద్యార్థులకే ఉచిత విద్య లభిస్తుందా ? అని ప్రశ్నించారు. ఆప్ ప్రభుత్వంలో ప్రతీఒక్క విద్యార్థికి ఉచిత విద్య లభిస్తోందని అన్నారు. తమ పిల్లలను విద్యాసంస్థల్లో చేర్చేందుకు తల్లిదండ్రులు బీజేపీ కార్యాలయాల చుట్టూ తిరగాలని వాళ్లు కోరుకుంటున్నట్లు విమర్శించారు.
Also Read: జ్యూస్లో విషం కలిపి లవర్ను చంపిన కిలాడీ.. కోర్టు సంచలన తీర్పు