/rtv/media/media_files/2025/04/11/2775iWdGlWUW3tl9FmxH.jpeg)
DMK Minister Removed From Party
తమిళనాడు అటవీశాఖ మంత్రి పొన్ముడి మహిళలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సింగర్ చిన్మయి, నటీ ఖుష్బూతో పాటు చాలామంది ప్రముఖులు ఆయన వ్యాఖ్యలను ఖండించారు. చివరికీ ఆయన సొంత పార్టీ నేతల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. దీంతో డీఎంకే అధిష్ఠానం సంచలన నిర్ణయం తీసుకుంది. పొన్ముడిని మంత్రి పదవి నుంచి తొలగించింది.
Also Read: ఆర్మీలో డాక్టర్ టెర్రరిస్ట్ గ్రూప్ మాస్టర్ మైండ్‌గా ఎందుకు మారాడు..?
DMK Minister Removed From Party
ఇక వివరాల్లోకి వెళ్తే డీఎంకే సీనియర్ నేత, అటవీశాఖ మంత్రి అయిన పొన్ముడి ఓ బహిరంగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హిందూ తిలకాలపై సెటైర్లు వేశారు. తిలకాలను లైంగిక భంగిమలతో పోల్చారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శలు చేశాయి. బీజేపీ నాయకురాలు, నటి ఖుష్బూ దీనిపై స్పందించారు. ''మీ మంత్రి చేసిన వ్యాఖ్యలకు అర్థం నాకంటే మీకే బాగా తెలుసు. ఇలాంటి వ్యాఖ్యలు మీ ఇంట్లో మహిళలు అంగీకరిస్తారా ? అంటూ'' సీఎం స్టాలిన్‌ను ప్రశ్నించారు. ఇలాంటి వాళ్లని దేవుడే శిక్షిస్తాడని సింగర్ చిన్మయి మండిపడ్డారు.
Also Read: 19 ఏళ్ల యువతిపై 23 మంది అత్యాచారం.. మోదీ సంచలన నిర్ణయం!
మరోవైపు డీఎంకే ఎంపీ కనిమొళి కూడా పొన్ముడి వ్యాఖ్యలపై స్పందించారు. ''పొన్ముడి వ్యాఖ్యలు ఆమోదయోగ్యమైనవి కాదు. కారణం ఏదైన సరే.. మహిళలపై అతడు చేసిన అవమానకర వ్యాఖ్యలు ఖండించాల్సిందేనని రాసుకొచ్చారు. చివరికీ పొన్ముడి వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదవ్వడంతో ఆయన్ని డీఎంకే అధిష్ఠానం మంత్రి పదవిని తొలగించింది. అలగే పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవితో పాటు మిగతా పదవులు కూడా తొలగించింది.
Also Read: HCU భూముల వెనుక రూ.10 వేల కోట్ల స్కామ్.. ఆ బీజేపీ ఎంపీ సహకరిస్తున్నాడు: కేటీఆర్
Also Read: స్కూల్ బ్యాగ్‌లో కండోమ్స్, తంబాకు ప్యాకెట్లు, కత్తులు, అగ్గిపెట్టలు.. ఎవర్రా మీరంతా!
rtv-news | telugu-news | dmk | tamil-nadu | latest-telugu-news | today-news-in-telugu | national news in Telugu | breaking news in telugu