Fire Accident: రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం?

ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. కన్నాట్ ప్లేస్‌లోని బిక్‌గానే బిర్యానీ రెస్టారెంట్‌లో సిలిండర్ లీకేజీ కారణంగా ఎగిసిపడిన మంటల్లో ఆరుగురు తీవ్రంగా కాలిపోయారు. వారి పరిస్థితి విషమంగా ఉండగా ఆస్పత్రికి తరలించారు. 6 అగ్నిమాపక వాహనాలతో మంటలను ఆర్పేశారు.

New Update
Fire accident

Delhi Bikgane Biryani restaurant Fire accident

ఢిల్లీ (Delhi) లో ఘోర అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించింది. కన్నాట్ ప్లేస్‌లోని బిక్‌గానే బిర్యానీ రెస్టారెంట్‌లో సిలిండర్ లీకేజీ కారణంగా ఎగిసిపడిన మంటల్లో ఆరుగురు తీవ్రంగా కాలిపోయారు. వారి పరిస్థితి విషమంగా ఉండగా ఆస్పత్రికి తరలించారు. 6 అగ్నిమాపక వాహనాలో మంటలను ఆర్పేశారు. 

Also Read :  బెస్ట్ హోలీ సాంగ్స్.. ఇవి వింటే హోలీ ఆడకుండా ఉండలేరు

ఆరుగురు తీవ్రంగా కాలిపోయారు..

ఈ మేరకు పోలీసులు, కస్టమర్లు తెలిపిన వివరాల ప్రకారం.. బిక్‌గానే బిర్యానీ రెస్టారెంట్‌లో గురువారం ఉదయం 11.55 గంటలకు అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో జనమంతా ఉక్కిరిబిక్కిరయ్యారు.  ఈ మంటల్లో ఆరుగురు తీవ్రంగా కాలిపోయారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా 6 అగ్నిమాపక వాహనాలను సంఘటనా స్థలానికి వచ్చి మంటలను ఆర్పేశాయి. రెస్టారెంట్ వంటగదిలోని ఎల్‌పిజి సిలిండర్ లీకేజీ కారణంగా మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆర్‌ఎంఎల్ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చూడండి: గుడ్ న్యూస్ ..త్వరలో తండ్రి కాబోతున్న కేఎల్ రాహుల్ 

ఇదిలా ఉంటే.. హైద‌రాబాద్ (Hyderabad) న‌గ‌రం ప‌రిధిలోని ముషీరాబాద్‌లో బుధ‌వారం రాత్రి భారీ పేలుడు జరిగింది. స్థానికంగా ఉన్న ఓ ప్లాస్టిక్ గోదాంలో భారీ పేలుడు సంభ‌వించ‌డంతో ఓ కార్మికునికి తీవ్ర గాయాల‌య్యాయి.పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. భోల‌క్‌పూర్ గుల్షన్ నగర్ కట్ని కాంట సమీపంలో ప్లాస్టిక్ గోదాం ని రన్‌ చేస్తున్నారు. అందులో బీహార్‌కు చెందిన ఇసాక్ అహ్మద్(28) అనే వ్యక్తి ప్లాస్టిక్ వస్తువులను  పగుల‌గొట్టి శుభ్రపరిచే పని లో ఉన్నాడు. ఈ క్రమంలో ఓ కెమికల్ డబ్బా పగులగొడుతుండగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. దీంతో ఏం జరిగిందో చుట్టుపక్కల వారికి అర్థం కాలేదు. దీంతో అందులో పని చేస్తున్న వ్యక్తి గురించి పెద్దగా పట్టించుకోలేదు.దీంతో అందులో పని చేస్తున్న ఇసాక్ అహ్మద్ తీవ్రం గాయాలపాలయ్యారు.

ఇది కూడా చూడండి: Horoscope Today:నేడు ఈ రాశివారు కష్టపడి పని చేస్తే విజయం మీదే!

Also Read :  ‘మా పెళ్లాలు తాగుడుకు బానిసలయ్యారు సారూ.. చర్యలు తీసుకోండి’.. పోలీస్ స్టేషన్‌కు భర్తలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

chidambaram: నేను క్షేమంగా ఉన్నాను..చిదంబరం

సబర్మతి ఆశ్రమంలో స్పృహ తప్పి పడిపోయిన కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం తాను క్షేమంగానే ఉన్ననని తెలిపారు. వీపరీతమైన వేడి కారణంగానే డీహైడ్రేషన్ కు గురైయ్యానని చెప్పారు. అన్ని రకాలుగా బావున్నానని తెలిపారు. 

New Update
P.Chidambaram: బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే జరిగేది ఇదే : పి. చిదంబరం

P. Chidambaram

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. గుజరాత్ లోని సబర్మతి ఆశ్రమంలో ఆయన ఓ కార్యక్రమానికి హాజరైయ్యారు. ఎండతీవ్రత కారణంగా అకస్మాత్తుగా కాంగ్రెస్ సీనియర్ నేత ఆరోగ్యం క్షీణించి స్పృహ కోల్పోయారు. అక్కడనే ఉన్న కార్యకర్తలంతా ఆయనను ఆసుప్రతికి తరలించారు.

ఏమవ్వలేదు...బావున్నారు..

ఆసుపత్రిలో చికిత్స అనంతరం చిదంబరం కోలుకున్నారు. తాను క్షేమంగానే ఉన్నానని చెప్పారు. విపరీతమైన వేడి కారణంగా డీహైడ్రేషన్ గురైయ్యానని కాంగ్రెస్ నేత తెలిపారు. ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నానని చెప్పారు. తన గురించి ఆలోచించన వారందరికీ ధన్యవాదాలు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరోవైపు చిదంబరం కుమారుడు కార్తీ కూడా దీనిపై స్పందించారు. తన తండ్రి ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. హార్ట్, బ్రెయిన్ డాక్టర్లతో సహా అన్ని స్పెషలిస్ట్ డాక్టర్లు తమ తండ్రిని పరీక్షించారని...అన్ని రిపోర్ట్ లు సాధారణంగానే ఉన్నాయని తెలిపారు.  స్థానిక జైడస్‌ ఆసుపత్రిలో ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని వెల్లడించారు.

 

 today-latest-news-in-telugu | p-chidambaram | congress | health 

 

Also read :  Renu Desai: నాకు రాజకీయాల్లోకి రావాలని ఉంది..రేణూ దేశాయ్

Advertisment
Advertisment
Advertisment