Crime: దారుణం.. తోటి విద్యార్థిని కాల్చి చంపి సూసైడ్‌ చేసుకున్న స్టూడెంట్.. వీడియో వైరల్

పంజాబ్‌లోని తర్న్‌తరన్ జిల్లాలో దారుణం జరిగింది. లా ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని తోటి స్టూడెంట్ కాల్చి చంపేశాడు. ఆ తర్వాత అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.

New Update
Shooting in College

Shooting in College

పంజాబ్‌(punjab) లోని తర్న్‌తరన్ జిల్లాలో దారుణం జరిగింది. లా ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని తోటి స్టూడెంట్ కాల్చి(shooting) చంపేశాడు. ఆ తర్వాత అతడు కూడా ఆత్మహత్య(suicide) చేసుకున్నాడు. సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని ఉస్మా అనే గ్రామంలో ఓ లా కాలేజీ ఉంది. ఇందులో ప్రిన్స్‌ రాజ్‌, సందీప్‌ కౌర్ అనే విద్యార్థులు ఫస్ట్‌ ఇయర్ చదువుతున్నారు. 

Also Read: ఆర్టిఫిషియల్ రంగంలో సత్తా చాటిన భారత్.. చాట్ GPT, జెమినిలను బీట్ చేసిన మన AI టూల్స్

College Shooting In Punjab - One Side Love

అయితే ప్రిన్స్‌రాజ్‌ సోమవారం ఉదయం తన వద్ద ఉన్న గన్‌తో క్లాస్‌కు వచ్చాడు. అప్పటికి క్లాస్ ఇంకా మొదలుకాలేదు. దీంతో తనవద్ద ఉన్న గన్‌తో సందీప్ కౌర్‌ తలలో కాల్చి చంపేశాడు. ఆ తర్వాత అదే పిస్తోల్‌తో అతడు సూసైడ్ చేసుకున్నాడు. సందీప్‌ కౌర్‌ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర గాయాలపాలైన ప్రిన్స్‌ రాజ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దుర్ఘటనను చూసిన తోటి విద్యార్థులు, కళాశాల సిబ్బంది షాకైపోయారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. 

Also Read: చైనాలో భారత్ తొలి జయకేతనం: అథ్లెటిక్స్‌లో తేజస్విన్ శంకర్‌కు 'గోల్డ్'

కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేపట్టారు. అయితే వన్‌సైడ్‌ లవ్‌(one-side-love) వల్ల ఈ దాడి జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. రాజ్‌ తీసుకొచ్చిన పిస్తోల్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు కాలేజీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాక్ష్యాలు సేకరించేందుకు ఫోరెన్సిక్‌ టీమ్‌ కూడా అక్కడికి చేరుకుంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. 

Advertisment
తాజా కథనాలు