Ranya Rao Case: రన్యారావు పెళ్లికి ముఖ్యమంత్రి సిద్ధు!

నటి రన్యారావు కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది.నటి వివాహ వేడుకలో ఆమెతో కలిసి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దిగిన ఫోటో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. బీజేపీ నేత అమిత్‌ మాలవీయ ఈ ఫొటోను ఎక్స్ వేదికగా షేర్‌ చేశారు

New Update
ranyaraosiddu

ranyaraosiddu

దుబాయ్‌ నుంచి విమానంలో అక్రమంగా బెంగళూరుకు బంగారాన్ని తెస్తూ దొరికిపోయిన నటి రన్యారావు కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది.నటి వివాహ వేడుకలో ఆమెతో కలిసి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దిగిన ఫోటో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. బీజేపీ నేత అమిత్‌ మాలవీయ ఈ ఫొటోను ఎక్స్ వేదికగా షేర్‌ చేశారు.

Also Read: Train Hijack: రైలు హైజాక్‌ ..ఆపరేషన్‌ సక్సెస్‌ అంటున్న పాక్‌ ఆర్మీ!

రన్యారావు స్మగ్లింగ్‌ కేసుకు సంబంధించిన సమస్య ఇప్పుడు సీఎం సిద్ధరామయ్య ఇంటి వరకు వచ్చింది. ఈ ఫొటోలో హోంశాఖ మంత్రి జి . పరమేశ్వర కూడా ఉన్నారు.ఈ కేసులో ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవంటూ డీకే శివకుమార్‌ ఈ విషయాన్ని కొట్టి పారేశారు అంటూ అమిత్‌ మాలవీయ విమర్శలు గుప్పించారు.

Also Read: Posani: బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్యే...పోసాని

స్మగ్లింగ్‌ లో ఆమెతో సంబంధమున్న వ్యక్తులను గుర్తించేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమెకు సంబంధించిన ప్రదేశాలు, వివాహం అయిన  హోటల్‌ కు వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు.నటి పెళ్లికి హాజరైన అతిథులు,వారిచ్చిన కానుకలపై దృష్టి సారిస్తున్నారు.ఈ క్రమంలోనే రన్యారావు వివాహ వేడుకకుసీఎం సిద్ధరామయ్య హాజరైన ఫొటో బయటకురావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఆయన పాత్ర పై...

ఈ స్మగ్లింగ్‌ లో ఆయన పాత్ర పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరో వైపు నటి బెయిల్‌ కోసం ప్రత్యేక కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి.ఈ క్రమంలోనే కేసులో మరికొన్ని కీలక విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.విమనాశ్రయంలో ఆమె తనిఖీలు తప్పించుకునేందుకు సాయం చేసిన అధికారికి..సంబంధితశాఖ అధికారుల నుంచి సూచనలు అందాయని న్యాయస్థానానికి డీఆర్‌ఐ తెలిపింది.

ఇటీవల దుబాయ్‌ నుంచి బెంగళూరుకు 14.2 కిలోల బంగారంతో వచ్చిన ఆమెను ..విమానాశ్రయం నుంచి నిష్క్రమించే చివరి నిమిషంలో అధికారులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. తరచూ దుబాయ్‌ వెళ్లడం...వెళ్లిన ప్రతిసారీ ఒకే రకమైన దుస్తులు ధరించడంతో అనుమానం వచ్చి ఆమె పై నిఘా పెట్టగాఈ స్మగ్లింగ్ వ్యవహారం బయటపడింది.దీంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Also Read: National: 350 ఏళ్ల పోరాటం.. దళితులకు ఆ గుడిలో పూజలు చేసుకునేందుకు అనుమతి!

Also Read: Dil Raju: వివాదం చేయొద్దు.. గద్దర్ అవార్డులపై దిల్‌రాజు సంచలన కామెంట్స్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు