/rtv/media/media_files/2025/04/11/Zjdk88Q34aeDHRpJiD69.jpg)
fan love story
బిహార్‌లో ఓ ప్రేమ వివాహం విచిత్రంగా జరిగింది. ఫ్యాన్ రిపేర్ కోసం వచ్చిన ఎలక్ట్రీషియన్ ఆ ఇంటి యువతిని ప్రేమలో పడేసి పెళ్లి చేసుకున్న ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాదు తమ లవ్ స్టోరీ గురించి దంపతులిద్దరూ మీడియాకు వెల్లడించగా జనాలు సరదాగా నవ్వుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Leave beginners Bihar is not for legends even 😂
— Frontalforce 🇮🇳 (@FrontalForce) April 7, 2025
“Pankha theek karte karte pyaar ho gaya , shadi kar li🙏🏻” pic.twitter.com/KgAYVS0GYT
Also Read : ట్రంప్‌కు షాకిచ్చిన చైనా.. ఏకంగా 125% టారిఫ్ విధింపు..
మొదటి చూపులోనే ప్రేమ..
ఈ మేరకు బిహార్‌లోని ఓ గ్రామానికి చెందిన యువతి ఇంట్లో ఫ్యాన్ పాడైపోయింది. దీంతో రిపేర్ చేయాలంటూ ఎలక్ట్రిషియన్‌ను పిలిపించుకుది. ఫస్ట్ టైమ్ వచ్చి తన పని తాను చేసుకొని వెళ్లిపోయాడు. అయితే మొదటి చూపులోనే ఆ యువకుడిని ఇష్టపడ్డ యువతి.. అతని ఫోన్ నెంబర్ సేవ్ చేసుకుంది. ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తుపు రిపేర్ అయినా అతనికే కాల్ చేయడం మొదలుపెట్టింది. ఇలా ఇద్దరి మధ్య పరిచయం మరింత క్లోజ్ కావడంతో ఇంట్లో వాళ్లను ఒప్పంచి పెళ్లి చేసుకున్నారు.
Also Read: ఆర్మీలో డాక్టర్ టెర్రరిస్ట్ గ్రూప్ మాస్టర్ మైండ్‌గా ఎందుకు మారాడు..?
ఇక తమ ప్రేమ పెళ్లి గురించి ఇలా చెప్పారు. 'ఫస్ట్ టైమ్ రిపేర్‌కు వెళ్లినప్పుడు ఆమె నన్ను ఇష్టపడినట్లు అర్థం చేసుకోలేకపోయా. కానీ ఆమె తరచూ ఫోన్ చేయడంతో అనుమానం వచ్చింది. అయినా పెద్దగా పట్టించుకోలేదు. ఒకరోజు లవ్ చేస్తున్నట్లు మెసేజ్ చేయడంతో అయోమయానికి గురయ్యాను' అని వరుడు చెప్పాడు. 'అతను మొదటిసారే నా మనసు దోచేశాడు. అతనిలో ఏదో కొత్తగా అనిపించింది. అతనితో మాట్లాడుతుంటే నాకు మంచిగా అనిపించేది. మొత్తానికి మేము పెళ్లి చేసుకోవడం సంతోంగా ఉంది' అంటూ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తతం ఈ వార్త వైరల్ అవుతోంది.
Also Read: TGPSC మరో కీలక నిర్ణయం.. ఇక నుంచి 1:1 నిష్పత్తిలో సర్టిఫికెట్ల పరిశీలన!
Also Read : సోషల్ మీడియాలో ఎక్కువ చేస్తే.. వాళ్లకు అదే ఆఖరి రోజు.. చంద్రబాబు మాస్ వార్నింగ్
love-story | telugu-news | Fan Repair | latest-telugu-news | today-news-in-telugu | national news in Telugu | viral news telugu