ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజధాని రాజకీయాలు వేడెక్కాయి. అధికార పార్టీ ఆమ్ ఆద్మీకి చెందిన 8 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు దక్కలేదని అసంతృప్తితో శుక్రవారం సొంత పార్టీకి రాజీనామా చేశారు. ఆ 8 మంది ఎమ్మెల్యేలు శనివారం బీజేపీలో చేరారు.
As expected Delhi AAP MLAs Rajesh Rishi, Madan Lal, Bhavna Gaur, Girish Soni, BS June, Naresh Yadav, Pawan Sharma, Rohit Mehraulia and Municipal Councilor Ajay Rai, who resigned from Aam Aadmi Party and Assembly membership yesterday, joined BJP today.😊 pic.twitter.com/oIMQKVN1XO
— Gurvinder Singh🇮🇳 (@gurvind45909601) February 1, 2025
ఇది కూడా చదవండి : Amit Shah: ఒక్కసారి మోదీకి అవకాశం ఇవ్వండి.. అది చేసి చూపిస్తాం: అమిత్ షా
ఆప్‌కు రాజీనామా చేసిన ఈ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే ముందు తమ ఎమ్మెల్యే పదవులకు కూడా రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను అసెంబ్లీ స్పీకర్‌కు అందజేశారు. పాలం నియోజకవర్గం నుంచి వందన గౌర్, త్రిలోక్‌పురి నుంచి రోహిత్ మెహ్రౌలియా, మెహ్రౌలి ఆప్ లీడర్ నరేష్ యాదవ్, కస్తూర్బా నగర్‌కు చెందిన మదన్ లాల్, ఉత్తం నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన రాజేష్ రిషి, మాదిపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే గిరీష్ సోని, బిజ్వాసన్ ఎమ్మెల్యే బీఎస్ జూన్,ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే పవన్ శర్మ లు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఇది కూడా చదవండి :Budget 2025: బడ్జెట్‌లో సామాన్యులకు ఊరట.. ఢిల్లీ ఎన్నికలపై ప్రభావం ఉంటుందా ?
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండా, బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవా సమక్షంలో బీజేపీ పార్టీ కడువా కప్పుకున్నారు. ఓటింగ్ కొన్ని రోజుల ముందు ఇలా జరగడం ఢిల్లీలో బీజేపీకి మైలేజ్ ఇస్తోందని అనుకుంటున్నారు. ఆప్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడం వల్లే వారు ఇన్ని రోజులు ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు ఆప్‌ను వీడి.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వనున్నారు.