Smoking and Lung cancer
Smoking: ధూమపానం చేసేవారికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు ధూమపానం చేయని వారిలో కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. లాన్సెట్ కొత్త అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సిగరెట్లు, హుక్కా లేదా బీడీ తాగకపోయినా ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలు ధూమపానం చేసేవారిలో కనిపిస్తాయి. కానీ ఇప్పుడు వాయు కాలుష్యం కూడా దానికి కారణమవుతోంది.
క్యాన్సర్‌కు ధూమపానంతో తక్కువ సంబంధం:
లాన్సెట్ రెస్పిరేటరీ మెడిసిన్ జర్నల్‌లో ఇటీవల ప్రచురితమైన ఒక పరిశోధన ప్రకారం ధూమపానం చేయని వారిలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని తేలింది. అధ్యయనం సమయంలో గ్లోబల్ క్యాన్సర్ అబ్జర్వేటరీ 2022 నుండి డేటాను విశ్లేషించారు. ఇది ధూమపానం చేయని వారిలో అడెనోకార్సినోమా అత్యంత సాధారణ క్యాన్సర్ అని కనుగొంది. అడెనోకార్సినోమా అనేది శరీరంలో శ్లేష్మం, జీర్ణ ద్రవాలను తయారు చేసే గ్రంథులలో అభివృద్ధి చెందే క్యాన్సర్. ఈ క్యాన్సర్‌కు ధూమపానంతో చాలా తక్కువ సంబంధం ఉందని పరిశోధకులు అంటున్నారు. అయితే వాయు కాలుష్యం దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: ఫైబర్ ఉండే ఆహారాలు తీసుకుంటే కలిగే ప్రయోజనాలు
ప్రపంచవ్యాప్తంగా నమోదైన అన్ని క్యాన్సర్ కేసుల్లో 53-70 శాతం ఎప్పుడూ ధూమపానం చేయని వ్యక్తులేనని అధ్యయనం వెల్లడించింది. ఊపిరితిత్తుల క్యాన్సర్ మరణాలలో ఐదవ వంతు ధూమపానం చేయనివారే ఉన్నట్టు చెబుతున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న దాదాపు 80 వేల మంది మహిళలు వాయు కాలుష్యంతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు పెరగడానికి వాయు కాలుష్యం ప్రధాన కారణమంటున్నారు. ముఖ్యంగా PM 2.5 వంటి కాలుష్య కారకాలు ఊపిరితిత్తుల్లోకి లోతుగా చొచ్చుకుపోయి కణాలను దెబ్బతీస్తాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని నిపుణులు అంటున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: బీపీ రోగులు ఇది రోజూ గుప్పెడు తింటే మందులు అక్కర్లేదు
( smoking-affects | smoking habit | health-tips | latest health tips | best-health-tips | latest-news | telugu-news)