/rtv/media/media_files/2025/03/15/wBoUXDt74EJiEZrPJYKf.jpg)
Joint pain Photograph: (Joint pain)
మారిన జీవనశైలి (Life Style) వల్ల చాలా మంది ఈ రోజుల్లో కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా అందరిని కూడా ఈ సమస్య వెంటాడుతోంది. అయితే దీని నుంచి విముక్తి పొందడానికి ఈ చిట్కాలు పాటించండి.
పసుపు
దీన్ని గోల్డెన్ స్పైస్ అని అంటారు. ఇందులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కీళ్ల నొప్పులను, వాపులను తగ్గించేందుకు సహాయపడుతుంది. కాబట్టి పసుపును ఆహారంలో భాగం చేసుకోండి. పసుపు టీని తాగడం ద్వారా ఆర్థరైటిస్ నొప్పులను తగ్గించుకోవచ్చు.
ఇది కూడా చూడండి: Punjab: స్వర్ణదేవాలయం దగ్గర గుర్తు తెలియని వ్యక్తి హల్ చల్..ఐదుగురికి గాయాలు
అల్లం
అల్లం అనేది ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఒక శక్తివంతమైన మూలిక. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. కీళ్ల అసౌకర్యాన్ని, వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. అల్లం నొప్పిని చాలా వరకు తగ్గిస్తుంది.
ఇది కూడా చూడండి: Rohit Sharma Retirement: రోహిత్ తర్వాత కెప్టెన్ ఎవరు?.. లైన్లో ముగ్గురు స్టార్లు!
కలబంద
కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. అలా చేయడం వల్ల ఉపశమనం కలుగుతుంది. కలబంద రసం తాగడం వల్ల కూడా ఆర్థరైటిస్ సౌకర్యాన్ని తగ్గించుకోవచ్చు.
ఇది కూడా చూడండి:Ranya Rao Case: రన్యారావు కేసు పై సీబీ'ఐ'..హడలి పోతున్న నేతలు!
గ్రీన్ టీ
గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువ ఉంటాయి. ఇది ఇన్ఫ్లమేషన్ తో పోరాడడానికి సహాయపడుతుంది. కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. ఇందులో ఉండే పాలిఫెనాల్స్ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను చాలా వరకు అదుపులో ఉంచుతుంది. గ్రీన్ టీ తాగడం వల్ల ఆర్థరైటిస్ లక్షణాలు తగ్గుతాయి. ప్రతిరోజూ రెండుసార్లు గ్రీన్ టీ తాగితే ఫలితం ఉంటుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.