/rtv/media/media_files/2025/04/13/ebGarBLycwgd8A6cZxKi.jpg)
Aloe Vera
చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి మార్కెట్లో చాలా క్రీములు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇంట్లో లభించే సహజ ఉత్పత్తులు చర్మ ఆరోగ్యానికి మంచివని బ్యూటీషియన్లు అంటున్నారు. వాటిలో కలబంద ఒకటి. జిడ్డుగల, పొడి, సున్నితమైన చర్మంతో సహా అన్ని చర్మ రకాలకు కలబంద మంచిదని నిపుణులు అంటున్నారు. ప్రకాశవంతమైన ముఖం కోసం ఒక చిటికెడు పసుపు, ఒక టేబుల్ స్పూన్ పాలు, కొద్దిగా రోజ్ వాటర్, ఒక టేబుల్ స్పూన్ తేనె బాగా కలపండి. ఆ తర్వాత ఈ మిశ్రమానికి కలబంద జెల్ వే మళ్ళీ కలపండి. దీన్ని ముఖం, మెడకు అప్లై చేసి ఇరవై నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత ముఖం బాగా కడుక్కోవడం వల్ల ముఖ కాంతి పెరుగుతుందని బ్యూటీ నిపుణులు సలహా ఇస్తున్నారు.
Also Read : పారామిలిటరీ బలగాలపై దాడి.. 100 మందికి పైగా?
చర్మంపై ఉన్న మచ్చలను తొలగించడంలో..
జిడ్డు చర్మం ఉన్నవారు మొటిమల సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటారు. అలాంటి వారు కలబంద ఆకులను నీటిలో కాసేపు మరిగించి పేస్ట్‌లా చేయాలి. ఆ పేస్ట్‌లో కొన్ని చుక్కల తేనె కలిపి ముఖానికి అప్లై చేయాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మొటిమలు అమ్మాయిలకు ఒక సాధారణ సమస్య. మొటిమలు వచ్చి పోయినప్పుడు మచ్చలు కనిపిస్తే మరింత ఆందోళన చెందుతారు. వీటిని తగ్గించడంలో కలబంద మంచిది. కలబంద గుజ్జులో రెండు చుక్కల రోజ్ ఆయిల్ కలిపి ముఖానికి అప్లై చేయాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. గాయాల వల్ల చర్మంపై ఉన్న మచ్చలను తొలగించడంలో కూడా కలబంద గుజ్జు ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. దీని కోసం కలబంద గుజ్జులో కొంచెం రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని శరీరంపై ఉన్న మచ్చలకు అప్లై చేసి 20 నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: మామిడి పండ్లు తినేప్పుడు ఈ తప్పులు చేయొద్దు
పొడి చర్మం ముఖాన్ని నిస్తేజంగా కనిపించేలా చేస్తుంది. చర్మంలో తేమ తక్కువగా ఉండటమే దీనికి కారణమని నిపుణులు అంటున్నారు. తేమ స్థాయిని పెంచాలనుకుంటే లబంద గుజ్జులో కొద్దిగా ఆలివ్ నూనె వేసి మెత్తని పేస్ట్ లా చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖంతో పాటు మెడకు కూడా అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడిగితే ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చర్మంపై టాన్ రావడం చాలా సాధారణం. కొంచెం కలబంద గుజ్జును తీసుకుని దానికి ఒక చెంచా పసుపు, నిమ్మరసం వేసి బాగా కలపండి. తర్వాత ఆ మిశ్రమాన్ని సమస్య ఉన్న ప్రాంతానికి అప్లై చేయండి. పది నిమిషాల తర్వాత కడిగేయండి. దీనివల్ల టాన్ తగ్గడమే కాకుండా ముఖంపై మొటిమలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
Also Read : ముంబై ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత.. మొత్తం ఎన్ని కిలోలంటే?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: 82శాతం మందిలో విటమిన్ డి లోపం..కారణం ఇదే
(pimples-tips | pimples-problem | face-pimples | face-tips | best-health-tips | latest health tips | health tips in telugu | aloe-vera | latest-telugu-news | today-news-in-telugu)