/rtv/media/media_files/2025/02/15/9ZpjE6GXE9R5jCSZnt1z.jpg)
Live News Updates in Telugu Photograph: (Live News Updates in Telugu)
🔴Live News Updates:
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలను ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడండి.
Assam Earthquake: గుండె హడల్.. అస్సాంలో భారీ భూకంపం..!
Assam Earthquake: అస్సాంలోని మోరిగావ్‌లో భారీ భూకంపం సంభవించింది. గురువారం ఉదయం 5.0 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. తెల్లవారుజామున 2.25 గంటలకు సంభవించినట్లు పేర్కొంది. దీంతో వెంటనే ప్రజలు తమ ఇల్లు, భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు. ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయంతో వణికిపోతున్నారు. అయితే భూకంప కేంద్రం, ప్రభావం గురించి వివరాలు వెంటనే స్పష్టంగా తెలియలేదు. దీన్ని మోస్తరు భూకంపంగా పరిగణిస్తారని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. దీనివల్ల ఇండోర్ వస్తువులలో గణనీయమైన వణుకు, గిలగిల శబ్దాలు, స్వల్ప నష్టం సంభవించే అవకాశం ఉందని వెల్లడించింది.
ఇది కూడా చూడండి: ఒకే వేదికపై తమిళ్ హీరో విజయ్ దళపతి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్
Indonesia Earthquake
ఇదిలా ఉంటే నిన్న (ఫిబ్రవరి 26) మరోసారి భూమి కంపించింది. తరచూ ఏదో ఒక ప్రాంతంలో భూప్రకంపనలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. మరోసారి భూకంపం సంభవించింది. ఇండోనేషియాలోని సులవేసి ద్వీపం సమీపంలో భూమి వణికింది. ఇండోనేషియాలోని ఉత్తర సులవేసి ప్రావిన్స్ ఆఫ్‌షోర్‌లో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.
ఇది కూడా చూడండి: National: సిద్ధాంతాలు తుంగలో తొక్కేసిన కమ్యూనిస్టు పార్టీ.. బీజేపీతో దోస్తీకి సై!
ఈ విషయాన్ని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) నివేదించింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి నష్టం కానీ, ప్రాణనష్టం కానీ జరగలేదని పేర్కొంది. ఉదయం 6:55 గంటలకు 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. అయితే అది 6.0 తీవ్రతతో కొంచెం తక్కువ భూకంపం సంభవించిందని ఇండోనేషియా వాతావరణ సంస్థ (BMKG) తెలిపింది. అంతేకాకుండా ఈ భూకంపం సునామీని ప్రేరేపించే ముప్పు కాదని పేర్కొంది.
ఇది కూడా చూడండి: Aadi Pinishetty: భార్యతో ఆది పినిశెట్టి విడాకులు.. అసలు విషయం బయటపెట్టిన హీరో
ఇదిలా ఉంటే ఇటీవలి సంవత్సరాలలో ఈ ప్రాంతం అనేక విధ్వంసకర భూకంపాలకు గురైంది. జనవరి 2021న సులవేసిలో 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 100 మందికి పైగా మరణించారు. అలాగే వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దీనికి ముందు 2018లో సులవేసిలోని పాలూలో 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం, సునామీ కారణంగా 2,200 మందికి పైగా మరణించారు.
ఇక 2004లో ఆషే ప్రావిన్స్‌లో 9.1 తీవ్రతతో సంభవించిన భూకంపం భారీ సునామీని సృష్టించింది. దీని వల్ల ఇండోనేషియాలోనే 1,70,000 మందికి పైగా మరణించడం విశేషం. అయితే ఇటీవలి భూకంపం తక్షణ నష్టం కలిగించనప్పటికీ, ఇండోనేషియా అధికారులు దీని పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. భూకంప ప్రభావిత ప్రాంతాలలో నివసించేవారు అప్రమత్తంగా ఉండాలని, దేశీయ విపత్తు నిర్వహణ అధికారులు జారీ చేసిన భద్రతా ఆదేశాలను పాటించాలని ఆదేశించారు.
-
Feb 27, 2025 14:04 IST
Gold Smuggling: ఖజ్జూర పండ్లలో బంగారం, విగ్‌లో కొకైన్.. పుష్పా మించిన ట్విస్టులు (VIDEO)
ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. జెడ్డా నుంచి ఢిల్లీకి ప్రయాణించిన ఓ వ్యక్తి ఖజ్జూర పండ్లలో 172 గ్రాముల బంగారం పెట్టి స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అధికారులకు పడ్డుపడ్డాడు. కొద్దిరోజుల క్రితమే మరో వ్యక్తి విగ్‌లో కెకైన్ పెట్టి పట్టపడ్డాడు.
Smuggling of Gold at Delhi Photograph: (Smuggling of Gold at Delhi) -
Feb 27, 2025 13:21 IST
Posani Arrest: పోసాని కృష్ణ మురళి భార్యకు YS జగన్ ఫోన్
-
Feb 27, 2025 10:22 IST
MLC Polling: తెలుగు రాష్ట్రాల్లో MLC ఎన్నికల పోలింగ్ ప్రారంభం
-
Feb 27, 2025 10:22 IST
Weather Updates: ఢిల్లీలో వర్షం.. ఈ రాష్ట్రాల్లో నేటి మార్చి 1 వరకు ఉరుములు, మెరుపులతో!
ఇవాళ ఢిల్లీలో తేలికపాటి వర్షాలు పడ్డాయి. వాతావరణశాఖ ప్రకారం.. నేటి నుంచి మార్చి1 వరకు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని పలు ప్రదేశాలలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు, మంచు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Weather updates Rain with thunderstorms likely in Delhi, downpours in these states predicted Photograph: (Weather updates Rain with thunderstorms likely in Delhi, downpours in these states predicted) -
Feb 27, 2025 10:21 IST
Actress Priyamani: ఛీ మీరు మనుషులేనా అసలు..పుట్టే పిల్లల గురించి కూడా అలాంటి కామెంట్లా!
-
Feb 27, 2025 09:26 IST
Wasim Akram: మీ కంటే కోతులు నయం.. పాక్ క్రికెటర్లపై వసీం అక్రమ్ మండిపాటు!
-
Feb 27, 2025 09:26 IST
MLC Polling: తెలుగు రాష్ట్రాల్లో MLC ఎన్నికల పోలింగ్ ప్రారంభం
-
Feb 27, 2025 07:01 IST
Trump: ఉద్యోగుల తొలగింపు పై ప్రణాళికలు రెడీ చేయండి..ట్రంప్ యంత్రాంగం ఆదేశాలు!
-
Feb 27, 2025 06:59 IST
Horoscope Today: ఆ రాశి వారికి ఈరోజు ప్రమోషన్లు వచ్చే అవకాశాలున్నాయి..మీ రాశేనేమో చెక్ చేసుకోండి!