/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ishan-jpg.webp)
ఆసియా కప్ ఫైనల్స్ తరువాత అవార్డుల సెర్మనీని భారత ఆటగాళ్ళు ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ఆ సందర్భంలో అవార్డుల ప్రెజంటేషన్ సమయంలో భారత ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్ మధ్య జరిగిన సరదా సంఘటనలు అభిమానులను మరింత ఖుషీ చేశాయి. విరాట్, ఇషాన్ ఒకరిని ఒకరు ఇమిటేట్ చేసుకుంటూ అందరి చేత నవ్వించారు. మొదట విరాట్ కోహ్లీ ఎలా నడుస్తాడో ఇషాన్ కిషన్ చూపించాడు. అచ్చం కోహ్లీలా నడుస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు.
అది చూసి విరాట్ కూడా స్పందించాడు. ఏ నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావ్? నేను అలా అస్సలు నడవను అంటూ ిషాన్ ను సరదాగా కసురుకున్నాడు. అంతేకాదు తరువాత ఇషాన్ ఎలా నడుస్తాడో విరాట్ కూడా ఇమిటేట్ చేశాడు. ఈ ఇద్దరి మధ్య ఫన్నీ మూమెంట్స్‌ని అక్కడే నిల్చున్న తిలక్ వర్మ, శ్రేయాస్ అయ్యర్,శుబ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్, హార్ధిక్ పాండ్యా అండ్ కో చూస్తూ నవ్వుకున్నారు. ఈ దృశ్యాలన్నింటినీ స్టేడియంలో ఉన్న కొందరు ఫ్యాన్స్, తమ మొబైల్ ఫోన్లలో బంధించి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Ishan Kishan mimics Virat Kohli's walk. (Rohit Juglan).
Virat Kohli counters it later! pic.twitter.com/1UWc7aaNsP
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 17, 2023