/rtv/media/media_files/2024/11/28/kJ8J5p7P5nfO31RfPWp2.jpg)
NETHANYAHU
లెబనాన్ పై ఇజ్రాయెల్ మరోసారి ప్రతీకార దాడులు కొనసాగిస్తోంది.బీరూట్ శివారు ప్రాంతం పై భారీ వైమానిక దాడులు చేసింది. వీటితో పాటు డ్రోన్ లతో మరో మూడు హెచ్చరిక దాడులకు పాల్పడింది.నగరమంతా వీటి శబ్దాలు వినిపించడంతో పాటు దట్టమైన పొగ అలముకుంది.తాజా పరిణామాలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యూహు స్పందిస్తూ..తమ పై వచ్చే బెదిరింపులను ఎదుర్కోవడానికి ప్రతిదాడులు తప్పవన్నారు. ఈ క్రమంలో లెబనాన్ అంతటా దాడి చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు.
ప్రతిచోట దాడులు....
లెబనాన్ ప్రభుత్వానికి స్పష్టమైన సందేశాన్ని పంపిస్తున్నా.సమీకరణాలు మారాయి.మా ప్రాంతాలపై ఎటువంటి దాడులను అనుమతించం. మీరు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేయకపోతే ...మేము అమలు చేస్తాం.ఇజ్రాయెల్ కు ఎటువంటి ముప్పు ఎదురైనా లెబనాన్ లో ప్రతిచోట దాడులు నిర్వహిస్తామని తెలిపారు. ఉత్తర భాగంలో ఉన్న మా ప్రాంతవాసులంతా సురక్షితంగా తమ ఇళ్లకు చేరుకునేలా చర్యలు తీసుకుంటాం అని నెతన్యాహు పేర్కొన్నారు.
మరో వైపు అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య గత నవంబరులో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాలు ఉల్లంఘనకు గురవుతున్నాయి.లెబనాన్ నుంచి తమ భూభాగంలోకి రాకెట్లు దూసుకొచ్చాయని ఇజ్రాయెల్ సైన్యం ఇటీవల ఆరోపించింది. హెజ్‌బొల్లామాతరం తాము వాటిని ప్రయోగించలేది,కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని తెలిపింది.అయినప్పటికీ తాజాగా బీరూట్ పై దాడులు చేసిన ఇజ్రాయెల్ తాజా హెచ్చరికలు చేసింది.
Also Read: Wife Cheating: మేనల్లుడితో అక్రమ సంబంధం.. కాఫీలో విషం కలిపి భర్తపై భార్య దారుణం!
israel | lebanon | attack | netanyahu | benjamin-netanyahu | benjamin netanyahu on lebanon | benjamin netanyahu hezbollah | latest-news | latest-telugu-news | latest telugu news updates