/rtv/media/media_files/2025/02/07/CyUEUy3OA6Ai0Zh5cWrL.jpg)
Iron Dome Defense System
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)..తాము ఐరన్ డోమ్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థను తయారు చేస్తామని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనిపై కెనడా కూడా స్పందించింది. ఐరన్ డోమ్ మిసైల్ డిఫెన్స్ తయారీలో భాగస్వామి అయ్యేందుకు తాము కూడా రెడీగా ఉన్నామని కెనడా మంత్రి బిల్ బ్లేయర్ అన్నారు. వాషింగ్టన పర్యటన ముగించుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. '' అమెరికాకు మేము అత్యంత కీలకమైన భాగస్వాములుగా ఉన్నాం. నార్త్ అమెరికా రక్షణ విషయంలో నాటో, నార్త్ అమెరికన్ ఏరోస్పేస్ డిఫెన్స్‌తో కలిసి పనిచేస్తున్నాం. ఇందులో భాగస్వాములు అయ్యేందుకు మేము రెడీగా ఉన్నామని'' బిల్ బ్లేయర్ అన్నారు.
Also Read: బీజేపీ తమ అభ్యర్థులను లాక్కోవాలని చూస్తుందన్న కేజ్రీవాల్.. ఎల్జీ సంచలన నిర్ణయం
Iron Dome - Canada
ఇదిలాఉండగా.. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా-కెనడా (America - Canada) మధ్య విభేదాలు పెరిగాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన అత్యాధునిక మిసైల్ డిఫెన్స్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ వ్యవస్థ.. బాలిస్టిక్, క్రూజ్ అలాగే హైపర్‌సోనిక్ క్షిపణులను అడ్డుకునేలా తయారుచేయాలని సూచనలు చేశారు. అయితే ఐరమ్ డోమ్ వ్యవస్థను ప్రసుతం ఇజ్రాయెల్ వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. హమాస్‌తో యుద్ధం జరుగుతున్న వేళ.. వేలాది రాకెట్లను ఈ ఐరన్ డోమ్ కూల్చివేసింది. 2011లో దీన్ని తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చారు.
Also Read: పాక్ ముష్కరుల చొరబాటు భగ్నం.. ఏడుగురిని మట్టుబెట్టిన భారత సైన్యం
మిసైల్స్‌ను దాదాపు 90 శాతానికి పైగా కచ్చితత్వంలో కూల్చేయగలదనే గుర్తింపు కూడా దీనికి ఉంది. ఇది వివిధ దశల్లో పనిచేస్తుంది. ముఖ్యంగా యారో-2, యారో-3 సిస్టమ్స్‌ను బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకునేందుకు వాడుతుంటారు. ఏకంగా 100 నుంచి 200 కిలోమీటర్ల స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను కూల్చేసేందుకు దీన్ని వాడుతారు. అంతేకాదు డ్రోన్లు, యుద్ధ విమానాలను కూడా కూల్చేయడంలో ఈ ఐరన్ డోమ్ సాయపడుతుంది.
Also Read: 'అయ్యో బిడ్డా'.. అమెరికాలో తెలుగు స్టూడెంట్ సూసైడ్.. పంపించేస్తారన్న భయంతో..!
Also Read : కేటీఆర్ కు జైలు ఇప్పట్లో లేనట్లే.. ఢిల్లీ టూర్‌లో సీఎం రేవంత్ సంచలన ప్రకటన!