Illegal Indian Migrants: అమెరికా నుంచి అక్రమ వలసదారులు ఔట్‌.. అమృత్‌సర్‌లో ల్యాండ్ అయిన విమానం

అక్రమ భారతీయ వలసదారులపై అమెరికా మరోసారి చర్యలకు దిగింది. టెక్సాస్‌ నుంచి 205 మందితో బయలుదేరిన సైనిక విమానం పంజాబ్‌లోని అమృతసర్‌ అంతర్జాతీయ విమానశ్రయంలో ల్యాండ్ అయ్యింది. వీళ్లు పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాలకు చెందినవారని తెలుస్తోంది.

New Update
US Military Plane Carrying 205 illegal Indian Migrants Lands In Amritsar

US Military Plane Carrying 205 illegal Indian Migrants Lands In Amritsar

Illegal Indian Migrants: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్(America President Trump) బాధ్యతలు చేపట్టినప్పటినుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. మరోవైపు అక్రమ వలసదారులపై కూడా ఉక్కుపాదం మోపుతున్నారు. అమెరికాలో ఉంటున్న కొందరు అక్రమ భారతీయులని ఇటీవల వెనక్కి పంపించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి కూడా చర్యలకు దిగింది. టెక్సాస్‌ నుంచి 205 మందితో బయలుదేరిన సైనిక విమానం పంజాబ్‌లోని అమృతసర్‌ అంతర్జాతీయ విమానశ్రయంలో ల్యాండ్ అయ్యింది.      

Also Read: వణికిస్తున్న ట్రంప్‌.. విదేశీ రాజకీయ నిధుల పై పట్టుబిగించిన గ్రీన్‌ ల్యాండ్‌!

వీళ్లందరూ పంజాబ్(Punjab), హర్యానా(Haryana), గుజరాత్(Gujrat), మహారాష్ట్ర(Maharastra), ఉత్తరప్రదేశ్‌(Uttarpradesh), ఛత్తిస్‌గఢ్‌(Chhattisgarh) రాష్ట్రాలకు చెందిన వారిగా తెలుస్తోంది. వీళ్లని అదుపులోకి తీసుకునేందుకు పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు లేవని సమాచారం. తనఖీలు చేసిన తర్వాత ఎయిర్‌పోర్ట్‌ నుంచి వాళ్లని బయటికి పంపించనున్నట్లు తెలుస్తోంది. అయితే బయటికీ పంపేముందు వాళ్లందరీ రికార్డులను కూడా పరిశీలిస్తారని ఢిల్లీ(Delhi)లోని అమెరికా ఎంబసీ(U.S. Embassy) అధికారులు తెలిపారు. అంతేకాదు రాబోయే రోజుల్లో కూడా మరిన్ని విమానాలు అమెరికా నుంచి భారత్‌కు రానున్నాయని పేర్కొన్నారు.  

Also Read: ట్రంప్‌ దూకుడు..ఈసారి ఏకంగా సీఐఏలోనే కోతలు!

అమెరికా లెక్కల ప్రకారం..

ఇదిలాఉండగా.. అమెరికా అధికారుల లెక్కల ప్రకారం చూసుకుంటే 20,407 మంది భారతీయుల(Indians) వద్ద సరైన పత్రాలు లేవని అధికారులు గుర్తించారు. మొత్తం 17,940 మందిని వెనక్కి పంపించేందుకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ప్రస్తుతం 2,467 మంది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అండ్‌ రిమూవల్‌ ఆపరేషన్స్‌ (ERO) నిర్బంధంలో ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు తాజాగా 205 మందిని వెనక్కి పంపించగా తర్వాత విడుతల వారిగా మరికొందరిని పంపిస్తారని తెలుస్తోంది. 

Also Read: కుల గణన సర్వేపై నెక్స్ట్ స్టెప్ ఇదే.. మంత్రి ఉత్తమ్ సంచలన ప్రకటన!

Also Read: వివేక్ కుట్రతో మాదిగలకు మళ్లీ అన్యాయం.. వర్గీకరణ ఇలా చేస్తారా?: మందకృష్ణ సంచలన ప్రెస్ మీట్!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు