/rtv/media/media_files/2026/04/11/us-agrees-to-iran-conditions-ahead-peace-talks-2026-04-11-15-03-27.jpg)
US agrees to Iran Conditions ahead peace talks
పశ్చిమాసియా(west-asia) లో ఉద్రిక్తతలు తగ్గించేందుకు కీలక ముందడుగు పడింది. ఇరాన్ తీసుకొచ్చిన ప్రతిపాదనలకు అమెరికా సానుకూలంగా స్పందించింది. మరికొన్ని గంటల్లో ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశానికి ముందుగానే ఇరాన్ పెట్టిన రెండు ప్రధాన డిమాండ్లకు అమెరికా అంగీకరించింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ దౌత్య వర్గాలు తెలిపాయి. లెబనాన్(lebanon) సరిహద్దుల్లో వెంటనే కాల్పుల ప్రకటించడం, అంతర్జాతీయ బ్యాంకుల్లో అమెరికా ఆంక్షల వల్ల ఫ్రీజ్ అయిన ఇరాన్ ఆస్తులను తక్షణమే రిలీజ్ చేయడం.. ఇరాన్ పెట్టిన ఈ రెండు కండిషన్లకు అమెరికా ఒప్పుకుంది.
Also Read: నడిరోడ్డుపై లాయర్ దారుణ హత్య.. ఆ తర్వాత బైక్ మొరాయించడంతో?
US Agrees To Iran Conditions
ఇరాన్ పెట్టిన రెండు కీలక షరతులకు అమెరికా అంగీకరించడం పశ్చిమాసియా రాజకీయాల్లో కీలక మలుపుగా ఉంటుందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు ఇరాన్ ఆస్తులను రిలీజ్ చేయడం వల్ల ఆ దేశానికి ఆర్థికంగా ఊరట దక్కనుంది. అలాగే లెబనాన్‌పై కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం వల్ల ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గనున్నాయి.
Also Read: మాములు స్కెచ్ కాదు.. నల్లగా ఉన్నావంటూ భర్తను లేపేసింది!
ఇదిలాఉండగా శుక్రవారం అర్ధరాత్రి పాక్(pakistan) ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌తో ఇరాన్ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. ప్రాంతీయ భద్రత, సరిహద్దుల్లో ఉగ్రవాద నియంత్రణపై చర్చించినట్లు తెలుస్తోంది. మరికాసేపట్లోనే పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో ఇరాన్ టీమ్ సమావేశం కానుంది. మరోవైపు అమెరికా-ఇరాన్ మధ్య జరిగే చర్చల్లో శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందం కుదురుంతా ? లేదా ? అనేదానిపై ఆసక్తి నెలకొంది.
Follow Us