Iran: ఇరాన్‌కు బిగ్ షాక్.. అణు విద్యుత్ కేంద్రంపై దాడులు
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ముదురుతున్నాయి. తాజాగా ఇరాన్‌లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రంపై క్షిపణి దాడులు జరిగాయి. ఈ విషయాన్ని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) వెల్లడించింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ముదురుతున్నాయి. తాజాగా ఇరాన్‌లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రంపై క్షిపణి దాడులు జరిగాయి. ఈ విషయాన్ని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) వెల్లడించింది.
పశ్చిమాసియాలో నెలరోజులుగా సాగుతున్న యుద్ధం సరికొత్త మలుపు తిరిగింది. ఇరాన్ ప్రధాన చమురు ఎగుమతి కేంద్రమైన ఖార్గ్ ఐలాండ్‌ను స్వాధీనం చేసుకోవడం దిశగా ట్రంప్ అడుగులు వేస్తున్నారు.
పశ్చిమాసియా యుద్ధం కారణంగా చమురు ధరలు పెరగడంతో విమానయాన సంస్థలు కూడా ఇంధన సర్ ఛార్జీల పేరుతో బాదుడు మొదలు పెట్టాయి. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మూలంగా గల్ఫ్ దేశాల నుంచి ఇంధన సరఫరా నిలిచిపోవడంతో విమాన ఇంధన (ATF) ధరలకు రెక్కలొచ్చాయి.
పశ్చిమాసియాలో గత రెండు వారాలుగా యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ ఆర్థిక సంపదపై అమెరికా దెబ్బకొట్టింది. ఆ దేశ చమురుకు కీలకంగా ఉన్న ఖర్గ్ ఐలాండ్‌పై అమెరికా బలగాలు భీకర దాడులు చేశాయి.
ఇకనుంచి గల్ఫ్ దేశాలపై దాడులు చేయమని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రూత్ సోషల్‌లో సంచలన పోస్టు చేశారు. ఇరాన్ మిడిల్‌ఈస్ట్‌కు లొంగిపోయి క్షమాపణలు చెప్పిందంటూ రాసుకొచ్చారు.
గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. గల్ఫ్ దేశాల్లోని జనావాస ప్రాంతాల్లో కూడా పలు దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన భారతీయులు ఈ యుద్ధ వాతావరణంలో భయంభయంగా గడుపుతున్నారు.
గల్ఫ్ దేశాల్లో మొదలైన యుద్ధ భారతీయ సామాన్యుడి వంటగదిపైనే కాకుండా, రైతాంగంపై కూడా కోలుకోలేని దెబ్బ తీసేలా కనిపిస్తుంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలు భారత ఎరువుల రంగాన్ని, ఇంధన భద్రతను తీవ్ర సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం పొంచి ఉంది.
ప్రస్తుతం ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కుర్దీష్ గ్రూపుల పాత్రపై సంచలన వార్తలు వస్తున్నాయి. అమెరికా నిఘా సంస్థ CIA కుర్దీష్ గ్రూపులతో కలిసి ఇరాన్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని వ్యూహాలు పన్నుతున్నట్లు తెలుస్తోంది.