/rtv/media/media_files/2026/04/04/iran-2026-04-04-18-14-53.jpg)
Iran says strike hit close to Bushehr nuclear facility, killing guard
పశ్చిమాసియా(west-asia) లో ఉద్రిక్త పరిస్థితులు ముదురుతున్నాయి. తాజాగా ఇరాన్‌లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం వద్ద క్షిపణి దాడులు జరిగాయి. ఈ విషయాన్ని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) వెల్లడించింది. ఇటీవల జరిగిన దాడుల్లో ఇది నాలుగో ఘటన అని తెలిపింది. మిస్సైల్ శకలం తగిలి సిబ్బందిలో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. ఈ ప్రాంతంలో ఓ భవనం కూడా దెబ్బతిన్నట్లు చెప్పింది.
Also Read: భారత్‌లో మరో ఉగ్రదాడికి ప్లాన్.. వెలుగులోకి సంచలన నిజాలు
Iran Says Strike Hit Close To Bushehr Nuclear Facility
ఈ దాడి వల్ల న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో ఎలాంటి రేడియేషన్‌కు దారి తీయలేదని IAEA తెలిపింది. ప్రస్తుతం చూసుకుంటే ఇరాన్‌లో పనిచేస్తున్న ఒకానొక విద్యుత్ ప్లాంట్ ఇదే. ఈ ప్లాంట్ లక్ష్యంగా తాజాగా దాడులు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఈ పరిణామాలపై IAEA డైరెక్టర్ జనరల్ రాఫెల్ మరియానో గ్రాస్సీ ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read: బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఒకే కుటుంబంలో తొమ్మిది మంది మృతి!
ఆ భవనాల్లో కీలకమైన పరికరాలు ఉండే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. అణు కేంద్రాల సమీప ప్రాంతాలపై దాడులు చేయకూడదని హెచ్చరించారు. అణు ప్రమాదాన్ని నివారించేందుకు సంయమనం పాటించాలని కోరారు. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ.. అణు భద్రత, రక్షణకు కట్టుబడి ఉండటం కీలకమని అన్నారు. అయితే ఈ దాడి వెనుక అమెరికా, ఇజ్రాయెల్ హస్తం ఉన్నట్లు ఇరాన్ అధికారులు భావిస్తున్నారు.
Follow Us