Kharg Island: ఇరాన్‌ చమురును తీసుకోవడం నాకు ఇష్టం.. ఖార్గ్‌ ఐలాండ్‌ను స్వాధీనం చేసుకుంటాం: ట్రంప్

పశ్చిమాసియాలో నెలరోజులుగా సాగుతున్న యుద్ధం సరికొత్త మలుపు తిరిగింది. ఇరాన్ ప్రధాన చమురు ఎగుమతి కేంద్రమైన ఖార్గ్ ఐలాండ్‌ను స్వాధీనం చేసుకోవడం దిశగా ట్రంప్ అడుగులు వేస్తున్నారు.

New Update
Trump

Trump

పశ్చిమాసియా(west-asia) లో నెలరోజులుగా సాగుతున్న యుద్ధం సరికొత్త మలుపు తిరిగింది. ఇరాన్ ప్రధాన చమురు ఎగుమతి కేంద్రమైన ఖార్గ్ ఐలాండ్‌(Kharg Island) ను స్వాధీనం చేసుకోవడం దిశగా ట్రంప్(Donald Trump) అడుగులు వేస్తున్నారు. తాజాగా ఫైనాన్షియల్ టైమ్స్‌తో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ చమురును తమ ఆధీనంలోకి తీసుకోవడమే తన ప్రాధాన్యత అని తేల్చిచెప్పారు. ఈ ఏడాది ప్రారంభంలో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించి అక్కడి చమురు పరిశ్రమను కంట్రోల్‌లోకి తీసుకున్నట్లే.. ఇరాన్‌లో కూడా సైనిక చర్య ఉండబోతోందనే ట్రంప్ సంకేతాలిచ్చారు.

ఖార్గ్ ఐలాండ్ స్వాధీనం చేసుకోవడంపై స్పందిస్తూ "ఇరాన్ చమురును తీసుకోవడం నాకు చాలా ఇష్టమైన పని. అమెరికాలోని కొందరు మూర్ఖులు నేను ఇలా ఎందుకు చేస్తున్నానని ప్రశ్నిస్తున్నారు. కానీ వాళ్లే ముర్ఖులు. ఐలాండ్‌ను స్వాధీనం చేసుకోవచ్చు లేదా చేసుకోకపోవచ్చు. మా ముందు చాలా ఆప్షన్లు ఉన్నాయని'' ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఇరాన్ తీరానికి 16 మైళ్ల దూరంలో ఉన్న ఈ ఐలాండ్ ద్వారా ఇరాన్ 90 శాతం చమురు ఎగుమతులు చేస్తోంది. ఒకవేళ అమెరికా దీన్ని స్వాధీనం చేసుకుంటే ఇరాన్ ఇంధన వాణిజ్యం పూర్తిగా ఆగిపోతుంది. కానీ ఇరాన్ అక్కడ సముద్రపు మైన్లను ప్రయోగించే ఛాన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల అమెరికా నౌకలకు ముప్పు ఉందని వార్నింగ్ ఇస్తున్నారు. 

Also Read: షాకింగ్ ఘటన.. విమానం గాల్లో ఉండగా ఎగ్జిట్ డోర్ తెరిచేందుకు యత్నించిన ప్రయాణికుడు

Trump Says He Got 'Gift' From Iran's Ghalibaf

యుద్ధం రోజురోజుకు ముదురుతున్న నేపథ్యంలో పెంటగాన్ సుమారు 10,000 మంది సైనికులను ఇరాన్‌కు తరలిస్తున్నట్లు వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. ఇప్పటికే 3,500 మంది సైనికులు అక్కడికి చేరుకున్నారు. అలాగే వేలాది సంఖ్యలో మెరైన్లు, పారాట్రూపర్లు సైతం ఇరాన్ వైపు వెళ్తున్నారు. ప్రస్తుతం ఇరాన్ రక్షణ వ్యవస్థలు బలహీనంగా ఉన్నాయని.. ఖార్గ్ ఐలాండ్‌ను ఈజీగా స్వాధీనం చేసుకోవచ్చని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. హర్మూజ్ జలసంధిని తెరిచేందుకు పాకిస్థాన్ మధ్యవర్తుల ద్వారా ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 6 లోగా ఒప్పందం కుదరకుంటే ఇంధన వనరులపై మరిన్ని దాడులు జరుగుతాయని హెచ్చరించారు.

అలాగే ఇదే సమయంలో ఇరాన్‌లో పాలన మార్పు కూడా జరుగుతుందని ట్రంప్ అన్నారు. వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ సహా సీనియర్ అధికారు మృతి చెందడంతో.. ప్రస్తుతం తాము సరికొత్త ప్రొఫెషనల్ టీమ్‌తో చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు. అయితే కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ గత కొంతకాలంగా బహిరంగంగా కనిపించడం లేదు. అతడు మరణించి ఉంటాడని లేదా తీవ్రంగా గాయపడి ఉండొచ్చని ట్రంప్ అనుమానాలు వ్యక్తం చేశారు. 

Also Read: DMK మేనిఫెస్టో విడుదల.. మహిళలకు నెలకు రూ.2 వేలు, పెన్షన్ పెంపు, ఉచిత విద్యుత్..

అంతేకాదు ఇరాన్‌ హర్మూజ్‌ జలసంధిలో నౌకలపై టోలు వసూలుచేస్తున్నట్లు వచ్చిన వార్తలపై కూడా ట్రంప్‌ స్పందించారు. ఒకవేళ అది నిజమైతే అమెరికా దాన్ని రెండు నిమిషాల్లో మూసివేసాలా చేస్తుందని భరోసా ఇచ్చారు. అలాగే సౌదీ అరేబియా, ఖతార్‌, UAE, బహ్రెయిన్‌ దేశాలు ఇరాన్‌పై తిరగబడుతున్నాయని పేర్కొన్నారు.  

Advertisment
తాజా కథనాలు