/rtv/media/media_files/2025/02/14/imhdQKPO1RcwTofDUvep.jpg)
Ukraine says Russia drone attack hits Chernobyl nuclear plant
Russia-Ukraine War: గత మూడేళ్ల క్రితం మొదలైన రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఉక్రెయిన్‌కి చెందిన న్యూక్లియర్ పవర్ ప్లాంట్(Nuclear Power Plant)పై రష్యా డ్రోన్ దాడి(Russia Drone Attack)కి పాల్పడింది. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Volodymyr Zelenskyy) ఈ విషయాన్ని వెల్లడించారు. గురువారం రాత్రి చెర్నోబిల్ వద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌పై రష్యా దాడి చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఈ ఘటన జరిగిన తర్వత అక్కడ రేడియేషన్(Radiation) సాధారణ స్థితిలోనే ఉన్నట్లు ఉక్రెయిన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్ అధికారులు తెలిపారు.
Also Read: బాస్‌లకే బాస్.. మోదీ కూర్చున్న కుర్చీని జరిపిన ట్రంప్
'' చెర్నోబిల్‌లో దెబ్బతిన్న నాలుగో రియాక్టర్ నుంచి వచ్చే రేడియేషన్‌ని వ్యాపించకుండా ప్రపంచాన్ని రక్షిస్తున్న షెల్టర్‌పై రష్యా డ్రోన్ దాడి చేసింది. యూనిట్‌ను కప్పిపుచ్చే కాంక్రిట్ షెల్టర్ ఈ దాడికి ధ్వంసమైంది. సిబ్బంది మంటలను ఆర్పేశారు. రేడియేషన్ లెవెల్స్ పెరగలేదు. ప్రస్తుతం వాటిని పర్యవేక్షిస్తున్నాం. ప్రాథమిక అంచనాల ప్రకారం.. షెల్టర్‌కు ప్రమాదం జరగడం ఇక్కడ కీలకంగా మారిందని'' జెలెన్‌స్కీ ఎక్స్‌లో రాసుకొచ్చారు.
Also Read: అదానీ కేసు గురించి అడిగిన అమెరికా మీడియా.. ప్రధాని మోదీ షాకింగ్ రియాక్షన్
రష్యా 133 డ్రోన్లతో ఉక్రెయిన్‌పై దాడి..
మరోవైపు అర్ధరాత్రి 2 AM కంటే ముందుగానే చెర్నోబిల్ ప్రదేశం వద్ద తమ బృంద సభ్యులు భారీ పెలుడు శబ్ధం విన్నట్లు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఎజెన్సీ కూడా ఎక్స్‌లో తెలిపింది. ఇదిలాఉండగా 1986లో ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలోని చెర్నోబిల్ వద్ద యూనిట్ 4 ధ్వంసమైంది. దీని ప్రభావానికి సోవియట్ యూనియన్, యూరప్‌లోని వివిధ ప్రాంతాల్లో రేడియోఆక్టివిటీ విస్తరించింది. ఇదిలాఉండగా.. గురువారం రాత్రి రష్యా 133 డ్రోన్లతో ఉక్రెయిన్‌పై దాడికి పాల్పడిందని ఉక్రెయిన్ మిలిటరీ తెలిపింది. ఇందులో 73 డ్రోన్లను కూల్చేశామని మరో 58 డ్రోన్లు తమ టార్గెట్ వద్దకు వెళ్లలేకపోయాయని పేర్కొంది .
Also Read: ముంబయి దాడుల సూత్రధారి అప్పగింతకు ట్రంప్ అంగీకారం!
Also Read: బిర్యానీ పంచాయితీ.. కస్టమర్లపై హోటల్ యాజమాన్యం దాడి