Donald Trump: వైట్‌హౌస్‌కు బర్గర్ ఆర్డర్ పెట్టిన ట్రంప్.. ప్రపంచదేశాల్ని యుద్ధంలో పడేసి ఎంజాయ్

సాధారణంగా దేశాధినేతల ఆహారం అత్యంత భద్రత మధ్య తయారవుతుంది. కానీ, ట్రంప్ తన విధానం క్షేత్రస్థాయిలో ఎలా పనిచేస్తుందో స్వయంగా పరీక్షించాలనుకున్నారు. ఇందులో భాగంగా ఆయన స్వయంగా మెక్‌డొనాల్డ్స్ నుండి ఒక బర్గర్‌ను ఆర్డర్ చేశారు.

New Update
_No tax on tips

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయంలో ప్రపంచదేశాలు బిక్కుబిక్కుమని వణుకుతున్నాయి. ఇరాన్‌తో యుద్ధం విషయంలో ఎప్పుడు ఏం చేస్తాడో అని, ఇప్పటికే చమురు నిల్వలు అందక కొన్ని దేశాల ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. పశ్చిమాసియాని నిప్పుల కుంపటి మీద పెట్టి ట్రంప్ హాయిగా బర్గర్ ఆర్డర్ పెట్టుకొని వైట్‌హౌస్‌(Trump White House Bunker) లో కాలు మీద కాలు వేసుకొని ఏసీ రూమ్‌లో కూర్చున్నాడు ట్రంప్. నిన్నమొన్నటి దాక వార్నింగ్‌ల మీద వార్నింగులు ఇచ్చి.. హార్ముజ్ జలసంధి తెరవాలని ఇరాన్‌కు డెడ్‌లైన్లు పెట్టి ట్రంప్ ఒక్కసారిగా కూల్ అయ్యాడు. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలో కలుగజేసుకొని అమెరికాలో ట్యాక్స్ పేయర్ల లక్షల డాలర్లు వృధా చేస్తున్నాడని అక్కడి ప్రజల్లో బాగా వ్యతిరేకత ఉంది. అయితే ఆ వ్యతిరేక త్వరలో అగ్రరాజ్యంలో వచ్చే మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీపై పడకూడదని ట్రంప్ పబ్లిసిటీ స్టంట్లు స్టార్ట్ చేశాడు. గతేడాది సర్కార్ నో ట్యాక్స్ ఆన్ టిప్స్(No tax on tips) అనే విధానాన్ని తీసుకువచ్చాడు. డిలివరీ చేసినప్పుడు ఇచ్చే టిప్ప్ పై ట్యాక్స్ పడకుండా రూల్ తీసుకువచ్చింది అమెరికా. ఆ సిస్టమ్ తీసుకువచ్చి సరిగ్గా ఏడాది పూర్తినై సందర్భంగా ట్రంప్ ఓ వినూత్న ప్రచారానికి దిగాడు. స్వయంగా ట్రంప్ ఆన్‌లైన్‌లో బర్గర్ ఆర్డర్ పెట్టుకున్నాడు. ఓ మహిళా డిలివరీ ఏజెంట్ ఆ బర్గర్‌ను వైట్‌హౌస్‌కు తీసుకువచ్చారు. ఆ దేశ అగ్రనేత అధ్యక్షుడే దాన్ని స్వయంగా పిక్ చేసుకోడానికి డోర్ తీశాడు. దీంతో ఆమె షాక్ అయ్యింది. 

Also Read :  ఉక్రెయిన్‌ సంచలన ప్రకటన.. కేవలం రోబోలతో రష్యా స్థావరం కైవసం

నేరుగా ఓవల్ ఆఫీస్‌కే బర్గర్ ఆర్డర్

సాధారణంగా దేశాధినేతల ఆహారం అత్యంత భద్రత మధ్య తయారవుతుంది. కానీ, ట్రంప్ తన విధానం క్షేత్రస్థాయిలో ఎలా పనిచేస్తుందో స్వయంగా పరీక్షించాలనుకున్నారు. ఇందులో భాగంగా ఆయన స్వయంగా మెక్‌డొనాల్డ్స్ నుండి ఒక బర్గర్‌ను ఆర్డర్ చేశారు. ఈ ఆర్డర్‌ను డెలివరీ చేయడానికి 'డోర్‌డాష్ గ్రాండ్మా'గా ప్రసిద్ధి చెందిన షారన్ సిమన్స్ వైట్ హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌కు చేరుకున్నారు. సాక్షాత్తూ అధ్యక్షుడే ఎదురుగా నిలబడి ఆర్డర్ అందుకోవడంతో ఆమె ఆశ్చర్యానికి గురయ్యారు.

డెలివరీ ఉమెన్‌కు $100 సర్ప్రైజ్ టిప్

ఆర్డర్ తీసుకున్న అనంతరం ట్రంప్ ఆమెతో కాసేపు సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా తన విధానం వల్ల డెలివరీ ఏజెంట్లకు ఎదురవుతున్న సానుకూల మార్పులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఆమెకు $100 (సుమారు రూ. 8,400 పైగా) టిప్పుగా ఇచ్చి ఆశ్చర్యపరిచారు. "టిప్పులపై పన్ను లేకపోవడం వల్ల సామాన్య కార్మికులకు, డెలివరీ ఏజెంట్లకు ఎంతో మేలు జరుగుతోంది. ఇది వారి కష్టార్జితాన్ని వారి దగ్గరే ఉంచుతుంది." - డొనాల్డ్ ట్రంప్

Also Read :  హార్మూజ్ జలసంధి దగ్గర హై టెన్షన్... బ్లాకేడ్‌ దిశగా అమెరికా.. తీవ్రపరిణామాలన్న ఇరాన్‌

పెరిగిన ఆదాయంపై షారన్ ఆనందం

ఈ సందర్భంగా షారన్ సిమన్స్ మాట్లాడుతూ.. ట్రంప్ తీసుకొచ్చిన ఈ కొత్త చట్టం తనలాంటి వారికి వరంలా మారిందని తెలిపారు. టిప్పులపై పన్ను మినహాయింపు వల్ల గడిచిన ఏడాది కాలంలో తనకు సుమారు $11,000 (సుమారు రూ. 9.2 లక్షలు) అదనపు ఆదాయం లభించిందని ఆమె వివరించారు. ఈ అదనపు సొమ్ము తన కుటుంబ అవసరాలకు ఎంతో ఉపయోగపడిందని ఆమె హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక దేశాధ్యక్షుడు స్వయంగా ఆర్డర్ ఇచ్చి, సామాన్య ఉద్యోగి కష్టాన్ని గుర్తించడం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సామాన్యుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడంలో ఈ 'నో ట్యాక్స్ ఆన్ టిప్స్' విధానం ఎంతలా ప్రభావం చూపుతుందో ఈ ఘటన స్పష్టం చేస్తోంది.

Advertisment
తాజా కథనాలు