ఎన్నికల ప్రచారం నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ (Donald Trump) కెనడా, మెక్సికోల పట్ల కఠినంగా ఉంటానని చెబుతూనే ఉన్నారు. ఆ దేశాల దిగుమతుల సుంకాలను పెంచుతానని చాలాసార్లే హెచ్చరించారు. ఈ రెండు దేశాలతో పాటూ చైనా పై కూడా ట్యాక్సులు విధిస్తానని చెప్పారు. తాజాగా ఈ హెచ్చరికలను నిజం చేశారు ట్రంప్. చైనా, కెనడా, మెక్సికో దేశాల దిగుమతులపై సుంకాలను పెంచే ఉత్తర్వుల మీద సంతకం చేశారు .
Also Read : 'ఇడ్లీ కడాయి' లోకి మరో హీరో ఎంట్రీ.. పోస్టర్ వైరల్!
భారీగా సుంకాలు..
ఈరోజు కెనడా,మెక్సికో దిగుమతులపై 25 శాతం, చైనాపై 10 శాతం సుంకాల అమలుకు సంతకం చేశానని అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా తెలిపారు. ఫెంటనిల్‌తో సహా మా దేశ పౌరులను చంపే చట్టవిరుద్ధమైన, ప్రాణాంతకమైన మాదక ద్రవ్యాల ముప్పు కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. తనకు అమెరికన్లను రక్షించాల్సిన అవసతరం ఉందని...అందుకే ఇలాంట నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. అందరికీ భద్రత కల్పించడం అధ్యక్షుడిగా నా బాధ్యత అని చెప్పుకొచ్చారు. దీనికి సబంధించి తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. చట్టవిరుద్ధంగా వచ్చే వలసదారులను, మాదక ద్రవ్యాలు మా సరిహద్దుల్లోకి రాకుండా చేస్తానని ఎన్నికల ప్రచారంలో మాటిచ్చాను. దానికి కట్టుబడి ఉన్నానని చెప్పారు. బైడెన్ ప్రభుత్వం ఉన్న సమయంలో దాదాపు 10 మిలియన్లకు పైగా అక్రమవలదారులు దేశంలోకి ప్రవేశించారని చెప్పుకొచ్చారు.
కెనడా ప్రతిస్పందన..
అయితే దీనిపై కెనడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రంప్ నిర్యానికి వ్యతిరేకంగా...అమెరికన్ ఉత్పత్తులపై సుంకాలను విధస్తున్నట్లు కెనడా ప్రధాన మంత్రి ట్రుడో ప్రకటించారు. అమెరికా నుంచి వచ్చేవస్తువులపై దిగుమతి సుంకం 25 శాతం విధిస్తున్నట్లు తెలిపారు. దీంతో కెనడా- అమెరికా (Canada-America) ల మధ్య వార్ మొదలైనట్టయింది.
Also Read: Union Budget 2025: కేజ్రీవాల్ విలవిల.. ట్యాక్స్ మినహాయింపు వెనుక మోదీ వ్యూహం ఇదే!
Also Read : ఏపీ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ