/rtv/media/media_files/2025/03/27/7kc84p2KvVw79sL5QXp5.jpg)
Foreign Made Vehicles Photograph: (Foreign Made Vehicles)
ట్రంప్ ఇప్పటికే వివిధ దేశాలపై సుంకాలను పెంచి వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. విషయం తెలిసిందే. తాజాగా ఆయన మరో నిర్ణయం ఆటోమొబైల్ రంగంలో సంచలనంగా మారింది. అమెరికాకు ఎగుమతి చేయనున్న కార్లపై భారీగా టారీఫ్ సుంకాలు పెంచుతున్నట్లు ట్రంప్ ప్రకటించాడు. ఏప్రిల్ 3 అర్ధరాత్రి తర్వాత కార్ల సుంకాలు అమల్లోకి వస్తాయని వైట్ హౌస్ అధికారి తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగుమతి చేసుకున్న వాహనాలపై 25శాతం సుంకాన్ని పెంచినట్లు ప్రకటించారు. దీంతో గురువారం ఆసియా ఆటో స్టాక్‌లు పడిపోయాయి. ఇది ప్రపంచ వాణిజ్య సమతుల్యతకు దారితీసింది. అమెరికా పన్నుల విధానం వల్ల దాని మిత్రదేశాల నుంచి విమర్శలు, ప్రతీకార బెదిరింపులు వస్తున్నాయి.
Also read: షుగర్ పేషెంట్లకు చేదు వార్త.. భారీగా పెరగనున్న డయాబెటిస్ మెడిసిన్ ధరలు
Trump Imposes 25 Percent Tariff On Foreign Cars
🚨TODAY: Pres. Trump announced that he put a 25% tariff on all automobiles that are not manufactured in the United States. pic.twitter.com/Cc58Ihidwg
— ✝️ Dr Margaret Aranda Ferrante, MD PhD FACFEI ♿️ (@TheRebelPatient) March 27, 2025
Also read: RAW: అమెరికాలో RWA పై ఆంక్షలు..!
అమెరికాలో తయారు కాని అన్ని కార్లపై 25 శాతం సుంకం విధిస్తున్నాం. ఈ సుంకం శాశ్వతంగా ఉంటుంది. యూఎస్‌లో తయారయ్యే వాటిపై మాత్రం ఎలాంటి సుంకం ఉండదు. ఏప్రిల్ 2 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని ట్రంప్ పేర్కొన్నారు. ఈ చర్యతో అమెరికాలో విదేశీ కార్ల ధరలకు రెక్కలు రానున్నాయి. ఏప్రిల్ 3 నుండి కార్లు, తేలికపాటి ట్రక్కులపై కొత్త సుంకాలు అమల్లోకి వస్తాయి. ఉక్కు మరియు అల్యూమినియంపై మరియు మెక్సికో, కెనడా మరియు చైనా నుండి వచ్చే వస్తువులపై ఇప్పటికే ప్రవేశపెట్టిన సుంకాలకు అదనంగా ఇవి వస్తాయి.
Also Read : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో చనిపోతాడు
Also Read : రామ్ చరణ్ ‘పెద్ది’పై చిరంజీవి స్వీట్ కామెంట్.. ఏమన్నారంటే?
latest-telugu-news | car | US tariffs | trump tariffs | tariff tax | big-tariff-hike | today-news-in-telugu | international news in telugu | business news telugu