/rtv/media/media_files/2026/04/14/china-into-war-2026-04-14-20-37-51.jpg)
అమెరికా,ఇజ్రాయెల్ Vs ఇరాన్ గా మొదలైన పశ్చిమాసియా యుద్ధం.. ఇప్పుడు ప్రపంచ దేశాలకు పాకింది. ఇప్పుడు చైనా(china) వార్‌లోకి ఎంటర్ అయ్యింది. హర్ముజ్ జలసంధి(strait of hormuz closed) లో మా షిప్‌లకు ఏమైనా జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని అల్టిమేటం జారీ చేసింది. చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ మాటలు వింటే అమెరికా మీద యుద్ధానికి సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా(iran america war news) అధ్యక్షుడు ట్రంప్ విధించిన నౌకా దిగ్బంధనంపై తాజాగా చైనా తీవ్రంగా స్పందించింది. ఇరాన్‌తో తమకున్న వాణిజ్య, ఇంధన సంబంధాల్లో జోక్యం చేసుకోవద్దని అమెరికాను హెచ్చరించింది. చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్ సోమవారం ఓ కీలక ప్రకటన చేశారు. టెహ్రాన్‌తో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలకు బీజింగ్ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. "మా నౌకలు హోర్ముజ్ జలసంధి గుండా రాకపోకలు సాగిస్తున్నాయి. ఇరాన్‌తో మాకు బలమైన ఇంధన ఒప్పందాలు ఉన్నాయి. వాటిని మేము గౌరవిస్తాము. మా అంతర్గత వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని సహించబోము," అని ఆయన హెచ్చరించారు. ఈ జలసంధి ఇరాన్ నియంత్రణలో ఉందని, చైనా నౌకలకు ఇది ఎప్పుడూ తెరిచే ఉంటుందని తేల్చి చెప్పారు. హర్మూజ్(blockade strait of hormuz) లో తన బలాన్ని చూపి అన్ని దేశాలను తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలన్న ట్రంప్ కు చైనా వ్యాఖ్యలు మింగుడు పడడం లేదు. మా జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ చైనా ఇచ్చిన వార్నింగ్ పై అమెరికా ఇంత వరకు స్పందించకపోవడం గమనార్హం. నెలన్నర దాటినా ఇరాన్ నే దారికి తెచ్చుకోలేకపోతున్న అమెరికా.. చైనా నౌకలను ముట్టుకుంటే చుక్కలు చూడాల్సి వస్తుందన్న చర్చ అంతర్జాతీయంగా సాగుతోంది. ఇన్నాళ్లు ఇరాన్ కు బ్యాక్ డోర్ ద్వారా సహకారం అందిస్తున్న చైనా ఇక నేరుగా రంగంలోకి దిగితే అమెరికా పరువు పోవడం ఖాయం అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో వ్యూహాత్మకంగా చైనాను వదిలేస్తే హర్మూజ్ పై ట్రంప్ చెప్పిన నియంత్రణ.. నవ్వుల పాలవుతుంది.
కొన్ని రోజుల క్రితమే రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా డైరెక్ట్ ట్రంప్‌కు ఓ స్ట్రాంగ్ మెస్సేజ్ పంపాడు. ఇరాన్, చైనా, రష్యా ఉన్నంత వరకూ ఈ ప్రపంచంలో అగ్రరాజ్యం అంటూ ఏదీ లేదని ఆయన అన్నారు. చైనా, రాష్యా సరసన ఇరాన్ ను చేర్చి.. అమెరికా పరువు తీశాడు పుతిన్. ఇరాన్ యుద్ధంలో అమెరికా ఓటమి బాట పట్టిందని ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చాడు. హర్మూజ్ జలసంధిని ఇరాన్ పాక్షికంగా దిగ్బంధించడాన్ని రష్యా(russia-putin) సమర్థిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల నుండి తనను తాను రక్షించుకోవడానికి ఇరాన్‌కు ఉన్న హక్కుగా రష్యా దీనిని అభివర్ణిస్తోంది. హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి, అక్కడ నౌకల రాకపోకలకు ఆటంకం కలిగించకుండా ఇరాన్‌ను నిరోధించడానికి అమెరికా పెట్టిన తీర్మానాన్ని కూడా చైనా, రష్యా వ్యతిరేకించాయి. దీంతో అమెరికాకు భయపడే పరిస్థితే లేదని ఆ దేశాలు ఐక్యరాజ్యసమితి వేదికగా తేల్చిచెప్పాయి. అవసరం వస్తే ఆ దేశంతో ప్రత్యక్ష యుద్ధానికి కూడా సిద్ధమన్న సంకేతాలు ఇస్తున్నాయి. ఇరాన్ కు తోడుగా రష్యా, చైనా రంగంలోకి దిగితే అమెరికాకు ఇబ్బందులు తప్పవు.
మరో వైపు.. ఇదే అదనుగా రష్యా అంతర్జాతీయంగా తన ఇమేజ్ పెంచుకోవాలని ప్లాన్ వేస్తోంది. చర్చలను ఈ సారి తమ దేశంలో నిర్వహిస్తామన్న సంకేతాలను పంపిస్తోంది. ఇరాన్ దగ్గర ఉన్న యురేనియాన్ని తమ దేశంలో భద్రపరచడానికి ఒప్పించే ప్రయత్నం చేస్తోంది. ఇరాన్ ఈ ప్రతిపాదనకు ఒప్పుకుంటే అమెరికా వైఖరి ఏంటనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. రష్యాలో ఈ డీల్ జరిగితే అంతర్జాతీయంగా ఆ దేశం మరో మెట్టు ఎక్కినట్లు అవుతుంది. మరో వైపు ఇరాన్ నుంచి వచ్చే యురేనియం ఆ దేశానికి అదనపు బలంగా మారుతుంది. అమెరికా ఈ డీల్ కు కూడా ఒప్పుకోకపోతే ఇరాన్-అమెరికా వార్ లోకి చైనా, రష్యా కూడా ఎంటర్ అయ్యే పరిస్థితులు ఏర్పడతాయి.
Also Read : వైట్‌హౌస్‌కు బర్గర్ ఆర్డర్ పెట్టిన ట్రంప్.. ప్రపంచదేశాల్ని యుద్ధంలో పడేసి ఎంజాయ్
అమెరికాతో చైనా, రష్యా యుద్ధం.. 2 ముఖ్య అంచనాలు
1. 'పరోక్ష యుద్ధం'కే మొగ్గు
చైనా, రష్యా రెండూ అమెరికాతో నేరుగా సైనిక యుద్ధానికి దిగడం వల్ల కలిగే భారీ ఆర్థిక, ప్రాణ నష్టాలను కోరుకోవడం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే, ఇరాన్‌కు రష్యా అత్యాధునిక నిఘా సమాచారం, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్స్, గైడెడ్ మిస్సైల్ టెక్నాలజీని అందిస్తోంది. అమెరికాను ఇక్కడ బిజీగా ఉంచడం ద్వారా, ఉక్రెయిన్ విషయంలో రష్యాపై ఉన్న ఒత్తిడిని తగ్గించుకోవచ్చనేది పుతిన్ వ్యూహం.
ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా చమురు కొనుగోలు చేస్తూ, దౌత్యపరమైన అండను చైనా అందిస్తోంది.
2. చమురు కోసం చైనా వార్
అమెరికా కారణంగా హర్మూజ్ నుంచి చైనాకు ఇంధన సరఫరా నిలిచిపోతే ఆ దేశం తీవ్రంగా స్పందించే అవకాశం ఉంది. తన 'చమురు భద్రత' కోసం చైనా తన నావికా దళాన్ని రంగంలోకి దించే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే రష్యా కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరిలో రష్యా, చైనా సంయుక్తంగా ఈ ప్రాంతంలో నావికా విన్యాసాలు నిర్వహించి ఇప్పటికే అమెరికాకు ఓ హెచ్చరికను పంపాయి.
Also Read : రష్యా మాస్టర్ ప్లాన్.. ఇరాన్ అంగీకరిస్తే యుద్ధానికి బ్రేక్
Follow Us