అమెరికాలో న్యూ యర్ రోజు మూడు చోట్ల అటాక్స్ జరగడం ఆందోళనకు దారితీస్తోంది. న్యూ అర్లీన్స్‌లో పిక్ అప్ ట్రక్ జనాల మీదకు దూసుకెళ్ళడం, ఆతరువాత కాల్పులు జరపిన ఘటనలో 15 మంది చనిపోయారు. మరో 30 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో ఎలాంటి విదేశీ కుట్రలేదని వైట్ హౌస్ తెలిపింది. దీనిపై, అదే రోజు జరిగిన మరో రెండు ఘటనల మీద అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ అత్యున్నత భద్రతాధికారులతో చర్చలు జరిపారు. ఈ ఘటన మీద జరుగుతున్న దర్యాప్తును అడిగి తెలుసుకున్నారు. తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో మొత్తం మూడు ఘటనలు జరిగాయని...అయితే వాటిలో ఎలాంటి విదేశీ కుట్ర కోణం లేదని బైడెన్ తెలిపారు. అయినప్పటికీ తమ ఫెడరల్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్, ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ స్వదేశీ, విదేశీ కుట్ర కోణంలో దర్యాప్తు జరుపుతున్నారని అని బైడెన్ చెప్పారు. Also Read : Cholesterol: కొలెస్ట్రాల్ తగ్గడానికి ఏ రొట్టె తినాలి? విదేశీ కుట్రలేదు.. న్యూ ఆర్లీన్స్ నిందితుడు షంషుద్దీన్ జబ్బార్ వాహనంతో దాడి చేయడాని కంటే ముందు అక్కడే ఉన్న ఫ్రెంచ్ క్వార్టర్ సమీపంలోని రెండు ప్రదేశాల్లోని ఐస్ కూలర్‌లలో పేలుడు పదార్థాలు అమర్చినట్లు అధికారులు గుర్తించారు. వాటిని సెట్ చేసేందుకు దుండగుడి వాహనంలో రిమోట్ డిటోనేటర్ కూడా గుర్తించారు. దీనిపై అధికారులు ఇప్పటికే దర్యాప్తు జరుపుతున్నారు. మరోవైపు నిందితుడు జబ్బార్ 100 పర్శంట్ ఐసీస్ నుంచి ప్రేరణ పొందాడని చెబుతోంది అమెరికా ఎఫ్‌బీఐ. దాడికి కొన్ని గంటల ముందు తన ఫేస్‌బుక్ ఖాతాలో నిందితుడు ఐదు వీడియోలను పోస్ట్ చేశాడు. అందులో అతను ఉగ్రవాద సంస్థకు తన మద్దతును ప్రకటించాడు. అంతేకాదు అతను తాను చేయబోయే హింసను ప్రివ్యూ కూడా చేసాడని ఎఫ్బీఐ అధికారులు చెప్పారు. దీన్ని బట్ట ఇది కచ్చితంగా ఉగ్రవాద చర్యే అంటున్నారు ఎఫ్‌బిఐ ఉగ్రవాద నిరోధక విభాగం డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ క్రిస్టోఫర్ రైయా. Also Read : కోరిక తీర్చలేదని..రాడ్డుతో కొట్టి.. మహిళ దారుణ హత్య న్యూ ఆర్లీన్స్ దాడి తర్వాత నిందితుడు జబ్బార్ పోలీసుల కాల్పుల్లో మరణించాడు అయితే తర్వాత ఎఫ్బీఐ అతని ఆధారాలను సేకరించింది. టెక్సాస్ వాసి అయిన 42 ఏళ్ళ జబ్బార్ అంతకు ముందు నేర చరిత్ర కలిగి ఉన్నావాడు. అతను ఒక నర్సును చంపిన కేసులో కూడా నిందితుడుగా ఉన్నాడు. Also Read: TS: వీడియోల ఘటనలో 12 మంది అరెస్ట్! మల్లారెడ్డి కాలేజ్ సీజ్? Also Read : నడి రోడ్డుపై భర్త హత్య.. మర్డర్ వెనుక సంచలన నిజాలు