/rtv/media/media_files/2024/11/03/0T7C16oNbbO2cBGQtcDU.jpg)
అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్న ట్రంప్ యంత్రాంగం..తాజాగా ఆరోగ్య విభాగంలో కోతలు మొదలు పెట్టింది.ఆరోగ్యం, మానవ సేవల విభాగం ఉద్యోగులకు తొలగింపు నోటీసులు పంపడం ప్రారంభించింది.హెచ్‌హెచ్‌ఎస్, ఇతర ప్రభుత్వ ఏజెన్సీల్లోని కార్మికులను తగ్గించాలని ట్రంప్ చర్యలు తీసుకున్న రోజుల వ్యవధిలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది.
అంటువ్యాధుల పర్యవేక్షణ, ఆహారం, ఆసుపత్రుల తనిఖీ,సగానికి పైగా దేశ జనాభా ఆరోగ్య బీమా కార్యక్రమాలను పర్యవేక్షించడంలో అమెరికా ఆరోగ్య విభాగం కీలకంగా వ్యవహరిస్తుంది. అయితే ఈ డిపార్ట్మెంట్ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా 10 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ ఇటీవల ప్రకటించారు.
తద్వారా ఏడాదికి దాదాపు 1.8 బిలియన్ డాలర్లు ఆదా అవుతుందన్నారు. కార్మిక శక్తిని 82 వేల నుంచి 62 వేలకు తగ్గించుకోనున్నట్లు తెలుస్తోంది. వీరిలో ముందస్తు పదవీ విరమణ తీసుకునే వారుసహా బైఅవుట్ ఆఫర్ పొందేవారు ఉన్నారు.
ఈ కోతల ప్రభావం పలు కీలక ప్రజారోగ్య విభాగాల పై పడనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ..3500 మంది ఉద్యోగులను తొలగించనుంది. అంటువ్యాధులను ట్రాక్ చేసే సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ లో 2400 ఉద్యోగాలు,నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ లో 1200 మందిని మెడికేర్ ఆరోగ్య బీమాను పర్యవేక్షించే విభాగంలో 300 ఉద్యోగాలను తొలగించేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
Also Read: Ranveer Allahbadia: యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియాకు షాక్.. సుప్రీం కోర్టు కీలక ప్రకటన
trump | layoffs | america | health | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates | doze | elanmusk | white-house