KA Paul Comments: వాడో ఇడియట్.. మోదీ ఏం పీకుతున్నావ్: ట్రంప్‌కు కేఏపాల్ వార్నింగ్!

మన పౌరులకు అమెరికన్స్ బేడీలు వేస్తుంటే మోదీ ఏం చేస్తున్నారని కేఏపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు ఉగ్రవాదులా? లేక రేపిస్టులా? అని ప్రశ్నించారు. మంత్రి జయశంకర్.. ఒక ఇడియట్ రాజీనామా చేయాలన్నారు. భారతీయులకు ఏమైనా అయితే ఊరుకోనంటూ ట్రంప్ కు వార్నింగ్ ఇచ్చారు.

New Update
ka paul

KA Paul fire on Modi and trump

KA Paul Comments: మన దేశ పౌరులకు అమెరికన్స్ బేడీలు వేస్తుంటే మోడీ(PM Modi) ఏం చేస్తున్నారని కేఏపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని ఆ విధంగా చూడటానికి వారు ఉగ్రవాదులా? లేక రేపిస్టులా? అంటూ తీవ్ర అసహనం చెందారు. ఇంత జరుగుతుంటే దేశ ప్రధాని ఏమి చేస్తున్నారని, మోదీ అమెరికా పర్యటనను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాదు విదేశాంగా మంత్రి జయశంకర్(Minister Jaya Shankar) ఒక ఇడియట్ అని, జయశంకర్ వెంటనే రాజీనామా చెయ్యాలన్నారు. 

Also Read: సీఎం రేవంత్ పై తిరగబడ్డ మంత్రి.. ఆ ఎమ్మెల్యేతో కలిసి ఖర్గేతో చర్చలు.. అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది?

కేఏపాల్ వెబ్ సైట్‌ను సంప్రదించండి..

చైనా(China)ను ఎదురించడానికి అమెరికాకు మన సహకారం చాలా అవసరం. ఒకప్పుడు మోడీని తిట్టిన చంద్రబాబు ఇప్పుడు తెగ పొగుడుతున్నాడు. అమెరికాలో ఇంత జరుగుతుంటే మన ఎంపీలు ఏమి చేస్తున్నారు. విశాఖ ఎంపీ భరత్ మావయ్య పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు. అమెరికాలోని ఇబ్బందిలో ఉన్న భారతీయులు కేఏపాల్ వెబ్ సైట్‌ను సంప్రదించండి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి వార్నింగ్ ఇస్తున్నా. నేను భారతీయుల కోసం నేను ఏమైనా చేస్తాను. ట్రంప్(Trump) నాకు మిత్రుడు మాత్రమే. ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ గలాన్ని విప్పాలి. అమెరికాలో భారతీయులకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత నాది.  ట్రంప్ భార్య కూడా అమెరికాకు విజిట్ వీసాపై వచ్చింది. వారిని ఇప్పుడు పంపించేస్తే కుదురుతుందా? అని ప్రశ్నించారు. 

Also Read: LIC: LIC పాలసీదారులకు బిగ్ అలర్ట్.. అవి క్లిక్ చేశారో అంతా గోవిందా!

లోకేష్ దగ్గరకు వెళ్తే హెల్ప్ ఏమి చేస్తారన్న పాల్.. లోకేష్ తండ్రి ఆయనకు దోచుకోవడమే నేర్పించాడన్నారు. వాళ్ళదగ్గర పవన్ నేర్చుకొని రూ. కోట్లు దోచుకుంటున్నాడు. ఢిల్లీ పెద్దలు కూడా నన్ను కలుస్తారు. జగన్ ఎందుకు కలవరు? అని ప్రశ్నించారు. ట్రంప్ కి మిలానియా మూడో భార్య. ఇక్కడ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కూడా ట్రంప్ ను ఫాలో అవుతున్నాడు. పవన్ సనాతన ధర్మం అంటున్నందుకు ఆయన భార్య విడాకులు ఇవ్వచ్చు. మళ్ళీ ఆమె సొంత దేశానికి వెళ్లిపోవచ్చ అన్నాడు. ఇక రేవంత్(CM Revanth Reddy) ప్రభుత్వం తెలంగాణను దోచుకుంటుందని విమర్శలు గుప్పించారు.

Also Read: Sekhar Basha: శేఖర్ బాషాకు బిగ్ షాక్.. మరో కేసు నమోదు..

Also Read: గిరిజన యువతులు నల్లగా, అంద వికారంగా.. ఒడిశా సీఎం చీప్ కామెంట్స్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు