Italy: ఇజ్రాయెల్‌కు షాకిచ్చిన ఇటలీ.. రక్షణ ఒప్పందం రద్దు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఇటలీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌తో ఉన్న రక్షణ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ప్రకటించారు. పశ్చిమాసియాలో అశాంతికి, ఉద్రిక్తతలకు ఇజ్రాయెల్ ప్రధాన కారణమని ఆమె ఆరోపించారు.

New Update
_defense agreement with Israel

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటలీ సంచలన నిర్ణయం(defense agreement with Israel) తీసుకుంది. ఇజ్రాయెల్‌తో ఉన్న రక్షణ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ఇటలీ ప్రధాని(italy-pm) జార్జియా మెలోని ప్రకటించారు. పశ్చిమాసియాలో ప్రస్తుత అశాంతికి, ఉద్రిక్తతలకు ఇజ్రాయెల్ ప్రధాన కారణమని ఆమె నేరుగా ఆరోపించారు. యుద్ధాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న మెలోని, గాజాలో జరుగుతున్న ప్రాణనష్టంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధం కారణంగా వేలాది మంది అమాయకులు, ముఖ్యంగా చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమని ఆమె పేర్కొన్నారు. "శాంతిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది, కానీ ఇజ్రాయెల్ చర్యలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి" అని ఆమె స్పష్టం చేశారు.

Also Read :  ట్రంప్ నెక్ట్స్ టార్గెట్ మలక్కా జలసంధి ? ఇండియాకు డేంజర్‌బెల్‌ ?

ట్రంప్ నిర్ణయాలపై బహిరంగ విమర్శలు

అమెరికా(america) మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలను కూడా మెలోని బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారు. ఇరాన్‌పై యుద్ధం(iran america war) చేయడానికి ట్రంప్ ఇతర దేశాల సాయం కోరడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. క్రైస్తవ మతగురువు పోప్‌పై ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను మెలోని ఖండించారు.

Also Read :  ఉక్రెయిన్‌ సంచలన ప్రకటన.. కేవలం రోబోలతో రష్యా స్థావరం కైవసం

అగ్రరాజ్యాల తీరుపై విమర్శలు

ప్రపంచవ్యాప్తంగా శాంతిని ఆశించే దేశాలు యుద్ధాన్ని వ్యతిరేకిస్తుంటే, కేవలం అమెరికా, ఇజ్రాయెల్ మాత్రమే యుద్ధాన్ని కోరుకుంటున్నాయని ఇటలీ ప్రభుత్వం ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇతర దేశాలు కూడా ఇప్పుడు అమెరికా అనుసరిస్తున్న యుద్ధ తంత్రాన్ని వేలెత్తి చూపిస్తున్నాయి. ఇటలీ తీసుకున్న ఈ నిర్ణయం యూరోపియన్ యూనియన్ దేశాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఇజ్రాయెల్‌కు ఇన్నాళ్లూ మద్దతుగా ఉన్న దేశాలు కూడా ఇప్పుడు మానవ హక్కుల ఉల్లంఘనను సాకుగా చూపి వెనక్కి తగ్గుతుండటం గమనార్హం. జార్జియా మెలోని సాహసోపేతమైన ఈ నిర్ణయం ఇటు ఇజ్రాయెల్‌కు, అటు అమెరికాకు దౌత్యపరమైన సవాలుగా మారింది.

Advertisment
తాజా కథనాలు