/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Dead-jpg.webp)
కెనడాలో హిందూ ఆలయాలపై, భారతీయులపై దాడులు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ భారతీయుడిని దుండుగుడు కత్తితో పొడిచి హత్య చేశాడు. కెనడాలో భారతీయ ఎంబసీ ఈ విషయాన్ని పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Also Read : అఘోరీ శవం తినడం నేను చూశాను - అంతా చెప్పేసిన వర్షిణీ!
Also Read : పెళ్లైన తెల్లారే జంప్.. ఇప్పటికే ముగ్గురితో మూడు ముళ్లు!
మృతుడెవరో తెలియలేదు..
ఒట్టావా సమీపంలోని రాక్ లాండ్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. భారతీయుడిని కత్తితో పొడిచిన అనుమానితుడిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య గురించి చెప్పిన ఎంబసీ మృతుడి సన్నిహితులకు, కుటుంబసభ్యులకు అన్ని విధాల అండగా ఉంటామని చెప్పింది. స్థానిక కమ్యూనిటీతోనూ సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పింది. అయితే మృతుడి పేరు, వివరాలను మాత్రం తెలపలేదు. కెనడా టైమ్ ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై దర్యాప్తు చేపట్టామని రాక్ లాండ్ పోలీసులు తెలిపారు.
Also Read: IPL 2025: ఈరోజు మ్యాచ్ లో ధోనీ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడా?
Also Read : సికింద్రాబాద్ లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అదృశ్యం!
canada | today-latest-news-in-telugu | india | international news in telugu | telugu crime news | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | breaking news in telugu