ప్రపంచాన్ని వణికించే వైరస్‌లను తయారు చేసే ల్యాబ్ చైనాలో ఉందా? కరొనా మరణమృదంగాన్ని మర్చిపోకముందే.. కొత్త వైరస్ డేంజర్ బెల్స్ మోగించనుందా? న్యూయర్ సెలబ్రేషన్స్ అయిపోయి మూడు రోజులు కాలేదు. ఓ వైరస్ పేరు చెప్పి బాంబు పేల్చింది చైనా. ప్రస్తుతం చైనా మాస్కులు మళ్లీ పెట్టుకోండి.. చేతులు కడుక్కోండి.. సోషల్ డిస్టెన్స్ పాటించండి.. అంటూ హెచ్చరిస్తోంది. చైనాలో హ్యూమన్ మెటానిమో అనే వైరస్ (HMPV) ప్రజల్ని పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ బారినపడిన రోగులతో అక్కడి హాస్పిటళ్లన్నీ నిండుతున్నాయని మీడియా సంస్థలు చెబుతున్నాయి. ప్రస్తుతం హ్యూమన్ మెటానిమో వైరస్ కేసులను చైనా నేషనల్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అడ్మినిస్ట్రేషన్ వెరిఫై చేస్తోంది. అక్కడ జరిగేదాని గురించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా నోరు మెదపడం లేదు. అసలు చైనాలో ఏం జరుగుతోంది? డేంజరెస్ వైరస్‌లు ఎలా పుట్టుకొస్తున్నాయి..? అప్పుడు కరోనా.. ఇప్పుడు హ్యూమన్ మెటానిమో వైరస్ వ్యాప్తికి కారణం ఎవరో తెలుసా? ఇప్పటి వరకు చైనాలో ఎన్ని వైరస్‌లు పుట్టుకొచ్చాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. Also Read : అధిక రక్తపోటు ఉంటే ఇవి అమృతం..అస్సలు మిస్‌కావొద్దు 2019 డిసెంబర్ లో పుట్టిన కరోనా.. 2019 డిసెంబర్ 31న చైనాలోని వ్యూహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్.. కోవిడ్ 19 మహమ్మారికి కారణమైంది. ప్రారంభంలో దీన్ని వైరల్ న్యూమోనియా అని పిలిచారు. అక్కడి నుంచి అది అన్ని దేశాలకు పాకింది. లక్షల మరణాలు.. జనాలు పిట్టళ్లా రాలిపోయారు. ప్రపంచవ్యాప్తంగా 76 కోట్లకు పైగా కోవిడ్ 19 కేసులు నమోదైయ్యాయని.. 69 లక్షల మరణాలు సంభవించాయని WHO తెలిపింది. మళ్లీ ఐదేళ్ల తర్వాత కరోనాని పోలిన మరో వైరస్ చైనాలో విజృభిస్తోంది. హ్యూమన్ మెటానిమో వైరస్ (HMPV) చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతుంది. కరోనా కంటే వేగంగా ఈ వైరస్ వ్యాపిస్తోందని ప్రసెంట్ చైనాలో పరిస్థితులను చూస్తోంటే తెలుస్తోంది. ఆదేశంలో ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదైయ్యాయని లెక్కలు చైనా వెల్లడించట్లేదు. కానీ.. ఆదేశంలో హాస్పిటల్స్ రోగులతో నిండిపోయిన వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హాస్పిటల్లో రోగులు కిక్కిరిపోయారు. కరోనా కేసుల గురించి కూడా చైనా మొదట్లో ఇలానే గోప్యంగా ఉంచింది. చైనా నుంచి హ్యూమన్ మెటానిమో వైరస్ జపాన్‌కు పాకింది. ప్రస్తుతం జపాన్‌లో కూడా HMPV వైరస్ వేగంగా స్ప్రెడ్ అవుతుంది. జపాన్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ నివేదిక ప్రకారం.. జపాన్‌లో 7 లక్షల 18 వేల కేసులు నమోదవుగా.. 5వేల ఆస్పత్రులు, క్లినిక్‌ల్లో HMPV వైరస్ బాధితులు చికిత్స పొందుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. గతేడాది డిసెంబర్ నెలలోనే 94 వేల 259 హ్యూమన్ మెటానిమో కేసులు వచ్చినట్లు అక్కడి మీడియా చెబుతోంది. జపాన్ మాత్రమే కాదు.. హాంకాంగ్ లోనూ ఈ వైరస్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. Also Read : హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్ కలకలం.. ఓ యువకుడు మృతి హ్యూమన్ మెటానిమో వైరస్ లక్షణాలు ఫ్లూ, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడగా అనిపించడం, శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది వంటివి HMPV సోకిన వారిలో కనిపిస్తున్నాయి. రోగి తుమ్మినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా స్పీడ్‌గా వ్యాప్తి చెందుతుంది. లక్షణాల తీవ్రత ఎక్కువై బ్రాంకైటిస్, నిమోనియాకు దారితీస్తోందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. 14 ఏళ్లలోపు పిల్లలు, వృద్ధులు ఎక్కువగా HMPV వైరస్ బారిన పడుతున్నారని తేలింది. రోగిని హైజినిక్‌గా ఉంచడం వల్ల ఇతరులకు వైరస్ వ్యాపించకుండా అడ్డుకోవచ్చు. చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవడం, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు తుంపర్లు గాల్లోకి వ్యాపించకుండా మాస్క్ ధరించాలని చైనాలో డాక్టర్లు రోగులకు సూచిస్తున్నారు. భారత్‌లో ఈ తరహా కేసులు ఇప్పటి వరకు ఏం కనిపించలేదు. చైనా నుంచి జపాన్, హాంగ్ కాంగ్ దేశాలకు వ్యాపించిన ఈ వైరస్ ఇండియాకు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. చలితీవ్రత ఎక్కువగా ఉన్న చోట వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు వైద్యులు గుర్తించారు. భారత్‌లోకి వైరస్ ప్రవేశిస్తే.. ఇప్పుడు వాతావరణ పరిస్థితులకు చాలా స్పీడ్‌గా హ్యూమన్ మెటానిమో స్ప్రెడ్ అవుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. హ్యూమన్ మెటానిమో వైరస్ కారోనాలాగే రెస్పిరేటరీ సిస్టమ్ మీద ప్రభావం చూపుతుంది. ఈ వైరస్ దీర్ఘకాలిక వ్యాధులు టీబీ, శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్, హెచ్ఐవీ వంటి వ్యాధులతో బాధపడేవారికి మరింత ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. 2018,2021 మధ్య లాంగ్యా హెనిపావైరస్ అనే మరో వైరస్‌లో కూడా చైనాలో పుట్టుకొచ్చింది. ఈ ఇన్ఫెక్షన్ జంతువుల నుంచి వ్యాప్తి చెందిదట. ఎలుకలా ఉండే ష్రూ అనే జంతువులు కారణంగా లాంగ్యా వైరస్ పుట్టింది. కరోనా తర్వాత కొత్తకొత్త వేరియంట్లు చైనాలో పుట్టుకొచ్చాయి. చైనా బయోవార్ చేయడానికే ఇలాంటి వైరస్‌లు ఉద్దేశపూర్వకంగా తయారు చేస్తోందని గతంలో కూడా పలు దేశాలు ఆరోపించాయి. కరోనా టైంలో కేసుల వివరాలు, కోవిడ్ తీవ్రత చెప్పి.. ఇతర దేశాలను అప్రమత్తం చేయలేదని చైనాను అమెరికా తప్పుపట్టింది. అలాగే ఇప్పుడు కూడా.. ఈ హ్యూమన్ మెటానిమో వైరస్ సంబంధించి డిసెంబర్ 16-22 మధ్య వచ్చిన కేసుల వివరాలు మాత్రమే చైనా బయపెట్టింది. హ్యూమన్ మెటానిమో వైరస్‌తోపాటు ఇన్‌ఫ్లుంయెజా ఏ, మైకోప్లాస్మా న్యుమోనియా, కోవిడ్–19 రోగులు కూడా చైనా హస్పిటల్స్‌లో బారులు తీరారు. Also Read : తల్లిదండ్రుల పర్మిషన్ ఉండాల్సిందే..సోషల్ మీడియాపై కేంద్రం నిర్ణయం!