/rtv/media/media_files/2025/03/22/RUcxi32vJqwobHt6dw5y.jpg)
london
ఓ సబ్ స్టేషన్ లో మంటల కారణంగా యూరప్ లోనే అత్యంత బిజీగా ఉండే హీత్రూ ఎయిర్ పోర్టులో సర్వీసులు నిలిచిపోయాయి. శుక్రవారం రాత్రి కొన్ని సర్వీసులను పునరుద్దరించే యోచనలో ఉన్నట్లుఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి. యూరప్ లోని ఇతర విమానాశ్రయాలకు మళ్లించడం వల్ల చిక్కుకుపోయిన ప్రయాణికుల కోసం తొలుత వీటిని నడుపుతామని తెలిపింది.
Also Read:Fire Accident: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. 1000 మంది కార్మికులు!
శనివారం నుంచి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. హీత్రూ ఎయిర్‌పోర్టు సమీపంలోని ఓ సబ్ స్టేషన్ లో మంటలు చెలరేగడం వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.దీంతో విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు.ఎయిర్ పోర్టు నుంచి రాకపోకలు సాగించే1350 సర్వీసులకు అంతరాయం కలిగినట్లు విమాన ట్రాకింగ్ సేవలందించే ఫ్లైట్ ర్యాడార్ 24 వెల్లడించింది.
Also Read: ఆన్‌లైన్ బెట్టింగ్ లకు మరో యువకుడు బలి.. రూ.10 లక్షల అప్పు చేసి
దాదాపు 120 విమానాలు గాల్లో...
విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించినప్పుడు దాదాపు 120 విమానాలు గాల్లో ఉన్నట్లు సమాచారం.కొద్ది సేపు కొన్ని విమానాలు గాల్లోనే చక్కర్లు కొట్టగా..మరికొన్నింటిని సమీప ఎయిర్ పోర్టులకు మళ్లించారు.ఈ అనూహ్య పరిణామంతో వేలాది మంది ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం ఏర్పడింది.
సబ్ స్టేషన్ లో అగ్ని ప్రమాదం వలన ఎయిర్ పోర్ట్ లోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఇళ్ళల్లో కూడా విద్యుత్ అంతరాయం ఏర్పడింది. మంటలు భారీగా ఎగసిపడడం వల్ల చుట్టుపక్కల నివాసాల్లో ఉన్న 150 మందికి పైగా ప్రజలను ఖాళీ చేయించినట్లు అధికారులు తెలిపారు. మంటలను ఆపడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. పది అగ్ని మాపక యంత్రాలు, 70 మంది సిబ్బంది ఇదే పనిలో ఉన్నారు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.
అత్యంత రద్దీ ఎయిర్ పోర్టుల్లో హీత్రూ ఒకటి.హీత్రూ అనేది గ్రామం పేరు.1946లో ఇక్కడ నుంచి విమాన రాకపకలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ నుంచి 90 దేశాల్లోని 230 కేంద్రాలకు సర్వీసులు వెళ్తున్నాయి. బ్రిటిష్ ఎయిర్‌వేస్, వర్జిన్ అట్లాంటిక్ ,లుఫ్తాన్సా సహా 90 విమానయాన సంస్థలకు సేవలందిస్తోంది. ఫిబ్రవరి నెలలోనే దాదాపు 57 లక్షల మంది ప్రయాణికులు ఇక్కడ నుంచి రాకపోకలు సాగించారు.
Also Read: NTR- Nelson Movie: ఎన్టీఆర్- నెల్సన్ మూవీకి 'ROCK' ఇంగ్ టైటిల్..!
Also Read: Samsung Galaxy S25 Edge: శాంసంగ్ హైక్లాస్ ఫోన్.. 200MP కెమెరాతో భారత్‌లో లాంచ్‌కు రెడీ!
london | air-port | fire | accident | flights | flights-cancelled | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates