Manipur: మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. రెండు ఇళ్లను తగలబెట్టిన ఆందోళన కారులు
మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగడం కలకలం రేపుతోంది. గురువారం ఉఖ్రుల్ జిల్లాలోని లిటన్ ఏరియాలో ఆందోళనకారులు రెండు ఇళ్లను తగలబెట్టారు. ఉదయం 7 గంటలకు ఈ ఘటన జరిగింది.
మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగడం కలకలం రేపుతోంది. గురువారం ఉఖ్రుల్ జిల్లాలోని లిటన్ ఏరియాలో ఆందోళనకారులు రెండు ఇళ్లను తగలబెట్టారు. ఉదయం 7 గంటలకు ఈ ఘటన జరిగింది.
నల్లగొండ జిల్లాలో శనివారం దారుణం జరిగింది. పసిబిడ్డ తల్లి అయిన ప్రియుడి భార్యను ఓ మహిళ పెట్రోల్ పోసి తగులబెట్టింది. నాంపల్లి మండలంలోని కేతెపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పక్కా ప్రణాళికతో పెట్రోల్ తీసుకువెళ్లిన మహిళ ఆమెపై పోసి నిప్పంటించింది.
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఒక భయంకరమైన ఘటన చోటుచేసుకుంది. ఒక మహిళ తన ప్రియుడిపై ఉన్న కోపంతో అతని ఇంటికే నిప్పంటించింది.
ఆఫ్రికాలోని కాంగో దేశంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. కోల్వేజీ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో విమానం రన్‌వేపై జారిపోయింది. వెంటనే అధికారులు అప్రమత్తమై 20 మంది ప్రయాణికులను సురక్షితంగా కాపాడారు. ఈ ప్రమాదంలో విమానం మొత్తం పూర్తిగా దగ్ధమైంది.
ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన బాంబు బ్లాస్ట్‌లో 12 మంది మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్‌లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. హర్యానా, పంజాబ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు.
హైదరాబాద్-విజయవాడ హైవేపై మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో షార్ట్‌సర్క్యూట్‌తో ఇంజన్లో మంటలు వచ్చాయి. దీంతో డ్రైవర్ అప్రమత్తమై వెంటనే బస్సును రోడ్డు పక్కకు ఆపేశాడు. డ్రైవర్ అప్రమత్తం కావడంతో 30 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
విశాఖలో దొంగపోలీస్, దాగుడు మూతల ఆట పేరుతో అత్తను లేపేసిన కోడలు విషయంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. యూట్యూబ్ వీడియోలు చూసి అత్తను ఎలా చంపాలని శోధించి మరి కోడలు అంతమొందించి న దారుణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది.
ప్రముఖ బాలీవుడ్ కమెడియన్, షో హోస్ట్ కపిల్ శర్మ కెనడాలో ‘కప్స్ కేఫ్’ పేరిట ఓ రెస్టారెంట్ ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. ఆ రెస్టారెంట్‌ను లారెన్స్ బిష్ణోయ్ క్రిమినల్ గ్యాంగ్ టార్గెట్ చేసింది. గత కొన్ని నెలలనుంచి రెస్టారెంట్‌పై తరచుగా కాల్పులకు తెగబడుతోంది.
ఏపీలోని డా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రావులపాలెం మండలం గోపాలపురంలో భర్తపై పెట్రోల్ పోసి భార్య నిప్పంటించింది. తన భర్త ప్రతిరోజు తాగివచ్చి వేధించడంతో వేధింపులు తాళలేక ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.