/rtv/media/media_files/2026/02/13/manipur-2026-02-13-20-47-45.jpg)
Two more houses set on fire in Ukhrul district in manipur
మణిపూర్(manipur) లో మరోసారి హింస చెలరేగడం కలకలం రేపుతోంది. గురువారం ఉఖ్రుల్ జిల్లాలోని లిటన్ ఏరియాలో ఆందోళనకారులు మరో రెండు ఇళ్లను తగలబెట్టారు. ఉదయం 7 గంటలకు ఈ ఘటన జరిగింది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మణిపూర్‌లో ప్రశాంత వాతావరణం కొనసాగుతోంది. తాజాగా మళ్లీ హింస చెలరేగడం ఆందోళన రేపుతోంది. ఇప్పటికే అక్కడ కేంద్ర, రాష్ట్ర భద్రతా బలగాలు మోహరించి ఉన్నాయి. అయినప్పటికీ పలుప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి.
Also Read: కేంద్రం కీలక నిర్ణయం.. రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల ఆర్థిక సాయం
Two More Houses Set On Fire
గురువారం ఉదయం 8 గంటల సమయంలో తుపాకీ కాల్పుల మోతలు వినిపించినట్లు పోలీసులు చెప్పారు. కానీ ఎవరూ గాయపడటం లేదా మరణించడం లాంటి ఫిర్యాదులు తమ వద్దకు రాలేదని తెలిపారు. తాజాగా చెలరేగిన హింసకు ఆ ప్రాంతంలోని రెండు వర్గాలకు చెందిన వారు మద్యం సేవించి గొడవపడటమే కారణమని తెలుస్తోంది. ఆదివారం రాత్రి నాగ, కూకీ తెగలకు చెందిన వారు మద్యం తాగిన మత్తులో వ్యక్తిగత విషయాలపై గొడవపడ్డారు. ఈ గొడవ పెద్దది కావడంతో ఇరువర్గాలకు చెందిన 40 ఇళ్లను ఆందోళనకారులు నిప్పు పెట్టారు. తాజాగా గురువారం మరో రెండు ఇళ్లను తగలబెట్టారు.
Also Read: వెనెజువెలా నుంచి రిలయన్స్ చమురు దిగుమతులు.. అమెరికా గ్రీన్‌సిగ్నల్
సమాచారం వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతంలో కర్ఫ్వూ విధించారు. లిటన్ ఏరియాతో సహా జిల్లావ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. మరోవైపు కుకీ తెగకు చెందిన మహిళలు చురాచంద్‌పూర్ జిల్లాలో నిరసనలు చేపట్టారు. అక్కడి స్థానిక ఎమ్మెల్యే ఎల్‌ఎం ఖవుతే అధికార పార్టీలో చేరడాన్ని వ్యతిరేకిస్తున్నారు. మిగతా ప్రాంతాల్లో కూడా ఆందోళనలు జరుగుతున్నాయి.
Follow Us