Musk-Tesla Cars: టెస్లా షోరూంలో అగ్ని ప్రమాదం... 17 కార్లు దగ్ధం..వారి చర్యే అంటున్న మస్క్‌!

టెస్లా కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. రోమ్ లో గల షోరూంలో ఈ ప్రమాదం జరగ్గా.. 17 కార్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కావాలనే కొందరు ఉగ్రవాదులు తన కంపెనీలపై ఇలా దాడులకు పాల్పడుతున్నారని మస్క్‌ ఆరోపిస్తున్నారు.

New Update
tesla

tesla

ఎలాన్ మస్క్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా షోరూంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇటలీలోని రోమ్ శివార్లలో గల షోరూంలో ఈ ఘటన చేసుకోగా.. మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 17 కార్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Trump-America:ఈ సారి ట్రంప్‌ కొరడా ఆరోగ్య శాఖ పై..వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు!

ఇటలీలోని రోమ్ నగర శివార్లలోని టెస్లా షోరూంలో సోమవారం రోజు రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు ఎలా వచ్చాయో తెలీదు కానీ.. షోరూం అంతా కాలిపోయింది. దీంతో అందులో ఉన్న 17 కార్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. హుటాహుటిన రంగంలోకి దిగారు. ఫైర్ ఇంజిన్ల సాయంతో సిబ్బంది మంటలను ఆర్పేశారు. అయితే ఉదయం 4.30 గంటలకు మంటలు అంటుకున్నాయని.. ఆ సమయంలో షోరూంలో ఎవరూ లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని అగ్నిమాపక దళం ఓ ప్రకటనలో పేర్కొంది.

Also Read: April Launch Smartphones: ఏప్రిల్‌లో ఫోన్ల జాతర.. బ్రాండెడ్ మోడల్స్ వచ్చేస్తున్నాయ్-ఫుల్ డీటెయిల్స్ ఇవే!

అయితే ఈ విషయం తెలుసుకున్న మస్క్ తాజాగా స్పందించారు. ఇది కావాలనే చేశారని ఆరోపించారు. తమ సంస్థ కేవలం ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే తయారు చేస్తోందని.. ఈ స్థాయిలో హింస చాలా పెద్ద తప్పని మస్క్‌ అన్నారు. మరోవైపు ఇటలీ ఉప ప్రధాని మాటియో సాల్విని సైతం దీనిపై స్పందించి మస్క్‌కు మద్దతుగా ఉన్నారు. టెస్లా కంపెనీపై కావాలని దాడులు చేయడం దారుణం అన్నారు. ఇకనైనా ఈ దాడులు ఆపాలని కోరుతున్నట్లు చెప్పారు. అలాగే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

 అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత..  మస్క్‌ను డోజ్ అధినేతగా నియమించారు. ఇక అప్పటి నుంచి వీరిద్దరూ కలిసి.. అనేక షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటూ .. చాలామంది శత్రువులను సంపాదించుకుంటున్నారు. ఈక్రమంలోనే స్థానిక ప్రజల నుంచి ఉగ్రవాదుల వరకు వీరిపై కోపంగా ఉన్నారు. అందుకే పగ తీర్చుకోవాలని ఎలాన్ మస్క్ కంపెనీపై దాడులు చేస్తున్నారు. అమెరికాతో పాటు అనేక దేశాల్లో ఈ దాడులు సాగుతున్నాయి. ఇటీవలే ట్రంప్ సైతం దీనిపై స్పందించి.. టెస్లా కార్లపై దాడికి పాల్పడితే 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తామని హెచ్చరించారు.

Also Read: Ranveer Allahbadia: యూట్యూబర్ రణ్‌వీర్‌ అల్హాబాదియాకు షాక్.. సుప్రీం కోర్టు కీలక ప్రకటన

Also Read: Kodali Nani: కొడాలి నానిని కాపాడేందుకు రంగంలోకి డాక్టర్ పాండా.. ఆయన ట్రాక్ రికార్డ్ తెలిస్తే షాక్ అవుతారు!

 

elan-musk | tesla | tesla-car | tesla-cars | fire accident | Tesla Showroom | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
Advertisment
Advertisment