/rtv/media/media_files/2025/02/14/R7UEe1nTDKbVvu8ty2g3.jpg)
Eggs
చాలా మంది నిత్యం గుడ్లను తమ ఆహారంలో భాగంగా చేసుకుంటారు. అయితే ఇటీవల పెరుగుతున్న కోడిగుడ్ల ధరలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో అయితే గుడ్ల ధరలు మరింతమండిపోతున్నాయి. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత ఇతర దేశాలపై సుంకాలు భారీగా విధించిన సంగతి తెలిసిందే. భారత్ తో సహా అనేక దేశాలపై పరస్పర సుంకాలు విధించాలని నిర్ణయించుకున్న ట్రంప్‌కు గుడ్లు తలనొప్పిని పెంచాయి.
ప్రపంచ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పుకునే అమెరికా యంత్రాంగం, దేశంలో పెరుగుతున్న గుడ్ల ధరల పట్ల ఆందోళన చెందుతోంది.అమెరికాలో గుడ్ల ధర ఆకాశాన్నంటుతోంది. పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే మెక్సికో, కెనడా వంటి దేశాల నుంచి ప్రజలు గుడ్లను అక్రమంగా రవాణా చేస్తున్నారు. కొన్ని నగరాల్లో ఒక డజను గుడ్ల ధర $10 అంటే సుమారు రూ. 870 కి చేరుకుంది. అమెరికాలో గుడ్ల ధరలు అకస్మాత్తుగా పెరగడానికి గల కారణాలు చూసినట్లైతే.. బర్డ్ ఫ్లూ H5N1 లేదా ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా మహమ్మారి వ్యాప్తి కారణంగా, 2022 సంవత్సరం నుంచి ఇప్పటివరకు అమెరికాలో 15 కోట్లకు పైగా కోళ్లు మృత్యువాతపడ్డాయి.
Also Read: France: ఐదేళ్ల నిషేధం..ఫ్రాన్స్ అధ్యక్ష పదవికి దూరం!
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో 1.9 కోట్ల కోళ్లు చంపబడ్డాయి. ఫలితంగా గుడ్ల సరఫరా తగ్గిందిప్రస్తుతం అమెరికా యూరప్‌లోని అనేక దేశాల నుంచి గుడ్లు కొనుగోలు చేయడానికి సిద్ధమవుతోంది. టర్కీ, దక్షిణ కొరియా నుంచి గుడ్లు కొనుగోలు చేయాలనే అమెరికా అనుకుంటుంది. ట్రంప్ అనేక దేశాలపై సుంకాలు, పరస్పర సుంకాలను ప్రకటించారు. దీని కారణంగా అమెరికాలో గుడ్లు కొనడం అంత సులభం కాదు. అదే సమయంలో, ఇతర దేశాల నుంచి అమెరికాకు గుడ్లను తీసుకురావడం సవాల్ తో కూడుకుంది. గుడ్లను దిగుమతి చేసుకోవాలనే అమెరికా ప్రతిపాదనను పోలాండ్, ఫిన్లాండ్, డెన్మార్క్ తిరస్కరించాయి.
Also Read:Ap Weather Alert: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!
america | eggs | prices | bird-flue | canada | mexico | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates