/rtv/media/media_files/2025/04/04/dWYvGg1PTMkXBENBFssF.jpg)
Modi Yunus dinner BIMSTEC Photograph: (Modi Yunus dinner BIMSTEC )
భారత ప్రధాని మోదీ ప్రస్తుత థాయ్‌లాండ్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా బీమ్‌స్టిక్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ఈ సదస్సులో భారత్‌తో పాటు థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, మయన్మార్, భూటాన్ దేశాల అధినేతలు కూడా పాల్గొన్నారు. అయితే షేక్ హసీనా బంగ్లాదేశ్‌ను వీడి భారత్‌లో తలదాచుకున్న తర్వాత మోదీని బంగ్లాదేశ్ చీఫ్ మహ్మద్ యూనస్ కలవడం ఇదే మొదటిసారి. ఈ సమావేశంలో పాల్గొనడంతో పాటు మోదీతో కలిసి విందు పంచుకున్నారు.
ఇది కూడా చూడండి: Ap Weather Report: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!
Bangladesh's Chief Advisor Md Yunus, Indian PM Modi, Nepal PM KP Sharma Oli at the BIMSTEC leaders dinner pic.twitter.com/l5l7HXg69o
— Sidhant Sibal (@sidhant) April 3, 2025
మోదీ పక్కనే కూర్చోని..
థాయ్‌లాండ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో ప్రధాని మోదీ పక్కనే బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత యూనస్ కూర్చుకున్నారు. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత రెండు దేశాల మధ్య సత్సంబంధాలు కూడా పెద్దగా లేవు. షేక్ హసీనా ప్రభుత్వం నిష్క్రమించిన తర్వాత మొదటిసారి జరుగుతున్న సమావేశం ఇదే.
ఇది కూడా చూడండి: Crime News: ఐదుగురు మహిళలతో నటుడు అక్రమ సంబంధం.. 64 ఏళ్ల వయసులో మారని బుద్ధి!
Watch: Visuals of PM Modi, Bangladesh's Yunus meeting in Bangkok https://t.co/3ULZjYesGg pic.twitter.com/eozZCfrO6n
— Sidhant Sibal (@sidhant) April 4, 2025
ఇది కూడా చూడండి: KKR VS SRH: మరీ ఇంత దారుణంగానా..ఎస్ఆర్హెచ్ కు ఏమైంది?
ఇదిలా ఉండగా ఇటీవల మహ్మద్ యూనస్ చైనా పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహ్మద్ మాట్లాడుతూ.. భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల గురించి ప్రస్తావించారు. భారత దేశానికి సముద్రం ఉందనే విషయాన్ని మరిచిపోయి మాట్లాడారు. భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలు పూర్తిగా భూపరివేష్టితమైవున్నందున బంగాళాఖాతానికి మేమే సంరక్షకులం. ఇదొక పెద్ద ప్రయోజనానికి అవకాశం కల్పిస్తోంది. అందుకే మా దేశంలో పెట్టుబడులు పెట్టండని చైనాని ఆహ్వానిస్తూ.. భారత దేశంపై విమర్శలు గుప్పించారు.
ఇది కూడా చూడండి: Pornography: పోర్న్ వీక్షకులకు బిగ్ షాక్.. 3 నెలల్లో 15 మంది అరెస్ట్.. ఎందుకో తెలుసా!
latest-telugu-news | thailand | muhammad-yunus | national news in Telugu | international news in telugu | breaking news in telugu