/rtv/media/media_files/2025/04/13/8T4HxLOgqLoHZErMHdtC.jpg)
china
చైనాలో బలమైన గాలులతో పాటు ఇసుక తుఫాను హడలెత్తిస్తుంది. ఈ బీభత్సమైన విలయంతో దేశ ప్రజలంతా భయంతో విలవిల్లాడిపోతుండగా.. అదికార యంత్రాంగం అప్రమత్తం అయింది. ఎక్కడ ఉన్న వాళ్లంతా అక్కడే ఉండాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే వందలాది విమాన సర్వీసులను, రైళ్ల రాకపోకలను రద్దు చేసింది.
Also Read:Whatsapp: వాట్సాప్ సేవల్లో అంతరాయం..!
అంతేకాకుండా దేశంలో జరుగుతున్న ఫుట్‌బాల్ మ్యాచ్‌లు సహా ఇతర ముఖ్య కార్యక్రమాలను సైతం నిలిపి వేసింది. చైనాలో శనివారం రోజు ఉదయం నుంచే బలమైన గాలులు వీస్తున్నాయి. దీనికి తోడు ఇసుక తుఫాను కూడా వస్తుండగా.. దేశం అంతా అల్లకల్లోలంగా మారిపోతోంది. దేశ రాజధాని బీజింగ్‌లో అయితే పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. భారీ గాలులకు అనేక చెట్లు నేలకొరిగాయి. ఎత్తైన స్తంభాలు సైతం పడిపోయాయి. మనుషులు సైతం గాలికి కొట్టుకుపోతుండడం.. తీవ్రంగా ఇసుక గాల్లో కలిసి మనుషులపైకి దూసుకొస్తుండడంతో... అక్కడి సర్కారు అప్రమత్తమైంది.
Also Read: USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు
693 విమాన సర్వీసులను...
బీజింగ్, డాక్సింగ్‌లో మధ్యాహ్నం కల్లా వందలాది విమాన, రైల్వే సర్సీలును అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది.ముఖ్యంగా మధ్యాహ్నం 2 గంటల వరకే మొత్తంగా 693 విమాన సర్వీసులను అక్కడి యంత్రాంగం రద్దు చేసింది. అలాగే స్థానికంగా ఉన్న పార్కులను తాత్కాలికంగా మూసేశారు. అంతేకాకుండా ఫుట్‌బాల్ మ్యాచ్‌లు , ఇతర ముఖ్యమైన కార్యక్రమాలను సైతం నిలిపి వేశారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ గాలులు, ఇసుక తుఫాను ప్రభావం కొనసాగుతుండగా.. 75 ఏళ్లలో ఎన్నడూ ఇంత శక్తివంతంగా గాలులు వీయలేదని సర్కారు చెబుతోంది.
ముఖ్యంగా చైనా ఉత్తర, తీర ప్రాంతాల్లో ప్రమాదకర వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.ఎక్కడ ఉన్న ప్రజలంతా అక్కడే ఉండాలని.. బలమైన గాలులు వీస్తున్నందున ఎలాంటి ప్రమాదాలు అయినా జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని హెచ్చరికలు జారీ చేశారు. ఏదైనా అత్యవసరం అయినా అధికారుల సాయం తీసుకోవాలని చెప్పారు.
Also Read: NASA: ఆ ఐడియా ఇస్తే రూ.25 కోట్ల నజరానా.. నాసా బంపర్ ఆఫర్
latest telugu news updates | latest-telugu-news | telugu-news | sand storms | china | flights | flights-cancelled | trains-cancelled | today-news-in-telugu | international news in telugu