OTT Releases This Week: ఫిబ్రవరి ఫస్ట్‌వీక్‌.. థియేటర్‌, ఓటీటీల్లో సందడే సందడి!

ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో పలు చిత్రాలు, సిరీస్‌లు రిలీజ్‌కు సిద్ధమయ్యాయి. అజిత్ విడాముయార్చి, నాగచైతన్య తండేల్ సహా మరికొన్ని చిత్రాలు థియేటర్‌లో విడుదల కానున్నాయి. అలాగే కోబలి సహా మరికొన్ని సిరీస్‌లు, చిత్రాలు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి.

New Update
this week theatre and ott relaesing movies and webseries

February 3 - 9 OTT and Theatre releases

OTT Releases This Week: 2025 ఏడాదిలో మరో నెల వచ్చేసింది. జనవరి ముగియగా.. ఇప్పుడు ఫిబ్రవరిలో అడుగుపెట్టాం. అయితే జనవరి నెలలో పలు అగ్ర హీరోల చిత్రాలతో పాటు.. మరికొన్ని చిన్న హీరోల చిత్రాలు సైతం థియేటర్లలో సందడి చేశాయి. ఇక ఇప్పుడు ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో కూడా పలు సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. వాటి విషయానికొస్తే.. 

Also Read: పార్లమెంట్ ను కుదిపేసిన కుంభమేళా తొక్కిసలాట

థియేటర్ చిత్రాలు (Theatre Releases)

నాగచైతన్య- సాయి పల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం ‘తండేల్’. చందూ మొండేటి ఈ చిత్రాన్ని అత్యంత గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. 

Also Read: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇకపై ఆ వందే భారత్‌లో నాన్ వెజ్ నిషేధం

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటిస్తోన్న కొత్త సినిమా ‘విడాముయార్చి’. మగిళ్ తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా తెలుగులో ‘పట్టుదల’ పేరుతో రూపొందుతోంది. ఇందులో త్రిష(Trisha) హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే రెజీనా, అర్జున్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రం ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అంటే ఫిబ్రవరి 6న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. 

సాయిరాం శంకర్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న సస్పెన్స్ థ్రిల్లర్(Suspense Thriller) మూవీ ‘ఒక పథకం ప్రకారం’(Oka Pathakam Prakaram). వినోద్‌ కుమార్‌ విజయన్‌ దర్శకత్వంలో రూపొందుతోంది. ఇందులో న్యాయవాదిగా సాయిరాం, పోలీసు ఆఫీసర్‌గా సముద్రఖని నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది.

Also Read: మా సిబ్బంది వారానికి 120 గంటలు పని చేస్తున్నారు.. ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు

ఓటీటీ చిత్రాలు, సిరీస్‌లు (OTT Movies And Web Series)

ఆడమ్‌ జే గ్రేవ్స్‌ దర్శకత్వంలో రూపొందిన లఘుచిత్రం ‘అనుజా’(Anuja). ఇదొక షార్ట్ ఫిల్మ్. ఈ చిత్రానికి బాలీవుడ్‌ నటి ప్రియాంకా చోప్రా(Priyanka Chopra) ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఇది ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’(Netflix)లో ఫిబ్రవరి 5 నుంచి హిందీలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ షార్ట్ ఫిల్మ్ ఇటీవల 97వ ఆస్కార్‌ నామినేషన్లలో(Oscar Nominations) ‘లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌’(Live Action Short Film) చోటు దక్కించుకుంది.

నెట్‌ఫ్లిక్స్‌

సెలబ్రిటీ బేర్‌ హంట్‌ (హాలీవుడ్‌ సిరీస్‌) - ఫిబ్రవరి 5
ప్రిజన్‌ సెల్‌ 211 (హాలీవుడ్‌ సిరీస్‌) - ఫిబ్రవరి 5
ది ఆర్‌ మర్డర్స్‌ (హాలీవుడ్‌ సిరీస్‌) - ఫిబ్రవరి 6

డిస్నీ+ హాట్‌స్టార్‌

కోబలి (తెలుగు సిరీస్‌) - ఫిబ్రవరి 4

సోనీలివ్‌

బడా నామ్‌ కరేంగే (హిందీ సిరీస్‌) - ఫిబ్రవరి 7

జీ 5

మిసెస్‌ (హిందీ మూవీ) - ఫిబ్రవరి 7

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

ది మెహతా బాయ్స్‌ (హిందీ చిత్రం) - ఫిబ్రవరి 7

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు