/rtv/media/media_files/2025/03/03/gdV9oTltJHke67QCQ4BC.jpg)
Telangana
బెట్టింగ్ యాప్ కేసు విషయంలో రోజురోజుకీ కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. వీటిపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బెట్టింగ్ యాప్ కేసులను సీఐడీకి బదిలీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత కొన్ని వారాలుగా రాష్ట్రంలో బెట్టింగ్ యాప్ కేసులు హల్‌చల్ చేస్తున్నాయి. వీటివల్ల ఎందరో ఆర్థికంగా నష్టపోవడం, కొందరు ప్రాణాలు కోల్పోయారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ ఒక్కసారిగా బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేస్తున్న వారిపై ఉక్కు పాదం మోపింది. మరి ఈ బెట్టింగ్ కేసు విషయంలో ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
ఇది కూడా చూడండి: Liquor Shops : 1+1..వైన్ షాప్స్ బంపరాఫర్.. ఎగబడ్డ మందుబాబులు!
మొత్తం 11 మందిపై..
ఇదిలా ఉండగా తెలంగాణ పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్‌పై గత కొద్ది రోజుల నుంచి ఉక్కుపాదం మోపిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఇన్ఫ్లుయెన్సర్లు, సినీ సెలబ్రిటీలపై కేసులు నమోదు చేస్తున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో 11 మంది ఇన్‌ఫ్లూయెన్సర్లపై, అలాగే మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో 25 మంది సినీ నటీ నటులపై కేసులు నమోదు చేశారు.
ఇది కూడా చూడండి: PF Withdraw -Atm: ఇక ఏటీఎం నుంచి పీఎఫ్ నగదు తీసుకోవచ్చు...ఎప్పటి నుంచో తెలుసా?
ఇది కూడా చూడండి: IPL 2025: ఉత్కంఠ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ విక్టరీ..
ఇది కూడా చూడండి: AP NEWS: షాకింగ్ న్యూస్.. ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్యశ్రీ బంద్.. ఎందుకంటే?
cid | cinema news in telugu | hyderabad | betting-apps | latest telangana news | telangana news today | telangana-news-updates | latest-telugu-news | today-news-in-telugu