/rtv/media/media_files/2025/03/30/okkhiPLhi6sdQ8i1kM6i.jpg)
Devara Japan Collections
Devara Japan Collections: టాలీవుడ్ హీరోలంటే ఇప్పుడు నేషనల్ లెవెల్ కాదు, ఇంటర్నేషనల్ లెవెల్ అని ప్రూవ్ చేస్తున్నారు మన హీరోలు. మరీ ముఖ్యంగా జక్కన్న రాజమౌళి హీరోలు అయితే ఇంటర్నేషనల్ మార్కెట్ లో దుమ్ము దులిపేస్తున్నారు. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇలా రాజమౌళి హీరోలకు పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ఉంది.
అయితే, జపాన్ మార్కెట్ మాత్రం మన హీరోలకి ఇప్పుడు సవాలుగా మారింది. ప్రభాస్ కి జపాన్ లో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.. రీసెంట్ గా RRR తో రామ్ చరణ్, తారక్ లకు కూడా మంచి క్రేజ్ ఏర్పడింది జపాన్ లో. ఈ హీరోల సినిమాలు నచ్చితే అక్కడి జనాలు ఎగబడి చూస్తారు. అందుకు ఉదాహరణ RRR, ఏడాది పాటు జపాన్ లో ఆడటమే కాకుండా బయట దేశాల నుండి రిలీజ్ అయిన అన్ని సినిమాల కంటే అత్యధిక వసూళ్లు రాబట్టి జపాన్ లో రికార్డు క్రియేట్ చేసింది.
Also Read: వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక!
చరణ్, తారక్ కాంబోలో రాజమౌళి తీసిన RRR జపాన్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తే, ఈ ఇద్దరి హీరోలు సెపరేట్ గా రిలీజ్ చేసిన సోలో సినిమాలకు మాత్రం ఆశించిన స్థాయిలో ఆదరణ లభించలేదు. ముఖ్యంగా ఎన్టీఆర్ ఈ విషయంలో రామ్ చరణ్ కంటే చాలా వెనకబడ్డాడు అనే చెప్పాలి.
RRR తర్వాత రామ్ చరణ్ నటించిన 'రంగస్థలం' ఎలాంటి ప్రొమోషన్స్ లేకుండానే జపాన్ లో అల్ టైం రికార్డు సెట్ చేసింది. KGF 1,2 జపాన్ రిలీజ్లతో పోటీ గా రంగస్థలం రిలీజ్ అయినప్పటికీ 2.5 మిలియన్ జపాన్ యిన్స్ వసూళ్లు సాదించి రికార్డు సెట్ చేసింది.
Also Read: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?
జపాన్ లో దేవరకు నిరాశే..
ఇక RRR తర్వాత ఎన్టీఆర్ నుండి వచ్చిన దేవర విషయానికి వస్తే కలెక్షన్స్ దారుణంగా ఉంది. జపాన్ లో నెల రోజుల ముందు నుండే దేవరను ప్రమోట్ చేస్తున్నా సరే సినిమా జపాన్ ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది. వాస్తవానికి దేవర మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే స్ట్రాంగ్ హిట్ ని సొంతం చేసుకోలేకపోయింది. ఇక జపాన్ లో లక్ పరీక్షించుకున్న దేవరకు నిరాశే మిగిలింది. మొత్తం మీద 1.2 మిలియన్ జపాన్ యెన్స్ మాత్రమే దేవర అందుకున్నట్టుగా అక్కడి రిపోర్ట్స్ తెలుపుతున్నాయి.
Also Read: ప్రతిదాడులు తప్పవు..లెబనాన్ కు నెతన్యాహు హెచ్చరికలు!
ఆ రకంగా దేవర, చిట్టిబాబు జపాన్ రికార్డులను అందుకోలేకపోయాడు. దీని బట్టి జపాన్ లో రామ్ చరణ్ క్రేజ్ ఏ లెవెల్ లో ఉందొ అర్థం చేసుకోవచ్చు. జపాన్ ఫ్యాన్స్ రీసెంట్ గా చరణ్ బర్త్ డే ని కూడా చాలా ఘనంగా నిర్వహించారు. అంతే కాదు ఇక్కడ తెలుగులో ప్లాప్ టాక్ తెచ్చుకున్న రామ్ చరణ్ "గేమ్ ఛేంజర్" మూవీని జపాన్ లో రిలీజ్ చేయాలనీ అక్కడి ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారాని సమాచారం.