/rtv/media/media_files/2025/04/02/20tZ22p4VH9iA3ASEEEH.jpg)
Amaravathiki Aahwanam
Amaravathiki Aahwanam: ప్రస్తుతం టాలీవుడ్ లో హారర్ థ్రిల్లర్స్(Horror Thrillers) హవా నడుస్తోంది. చిన్న హీరోల నుండి పెద్ద హీరోల వరకు అందరూ హారర్ సినిమాలని లైన్లో పెడుతున్నారు. తాజాగా ఎస్తర్, సుప్రిత, ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ జి.వి.కె తెరకెక్కిస్తున్న హారర్ థ్రిల్లర్ మూవీ ‘అమరావతికి ఆహ్వానం’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను కె.ఎస్ శంకర్‌రావు, ఆర్.వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Also Read: ప్రధాని నుంచి సినీ తారల వరకు అంతా షాకయ్యారు! అసలు 'Adolescence' సీరీస్ లో ఏముంది?
సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ గా..
శివ కంఠమనేని, హరీశ్, జెమినీ సురేశ్, భద్రమ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఒళ్ళు గగుర్పొడిచే హారర్ ఎలిమెంట్స్ తో ఆధ్యాంతం ఉత్కంఠభరితంగా సాగే కథతో, సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ గా ఈ మూవీ ని తెరకెక్కిస్తున్నారు.
Also Read: యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియాకు షాక్.. సుప్రీం కోర్టు కీలక ప్రకటన
అంజి మాస్టర్ డిజైన్ చేసిన యాక్షన్ సీన్స్ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయి. త్వరలో ఈవెంట్ పెట్టి సినిమాకు సంబంధించి అన్ని వివరాలు తెలుపుతామని దర్శక, నిర్మాతలు వెల్లడించారు. ఈ సినిమాకి సంగీతం పద్మనాభన్ భరద్వాజ్ అందిస్తున్నారు.
Also Read: ఏప్రిల్‌లో ఫోన్ల జాతర.. బ్రాండెడ్ మోడల్స్ వచ్చేస్తున్నాయ్-ఫుల్ డీటెయిల్స్ ఇవే!
Also Read: ఈ సారి ట్రంప్ కొరడా ఆరోగ్య శాఖ పై..వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు!