/rtv/media/media_files/2025/04/02/nl7Wdlx7YrfbLlxxWEIH.jpg)
JAAT moivie first song
బాలీవుడ్ హీరో, టాలీవుడ్ డైరెక్టర్ కలిసి చేస్తున్న కొత్త చిత్రం ‘జాట్’. హిందీలో రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
Also Read: యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియాకు షాక్.. సుప్రీం కోర్టు కీలక ప్రకటన
తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘టచ్ కియా’ అంటూ సాగే ఈ సాంగ్ అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. ఈ సాంగ్‌లో ఊర్వశీ రౌతేలా డాన్స్ చించేశారు. ముఖ్యంగా జానీ మాస్టర్ అందించిన కొరియోగ్రఫీ అదిరిపోయింది. ఎన్నో వివాదాల తర్వాత జానీ మాస్టర్ మళ్లీ తనను తాను నిరూపించుకుంటున్నాడు. తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
Also Read: ఏప్రిల్‌లో ఫోన్ల జాతర.. బ్రాండెడ్ మోడల్స్ వచ్చేస్తున్నాయ్-ఫుల్ డీటెయిల్స్ ఇవే!
Also Read: ఈ సారి ట్రంప్ కొరడా ఆరోగ్య శాఖ పై..వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు!
ఇదిలా ఉంటే ప్రముఖ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అండ్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ దీన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో రెజీనా, సయామీ ఖేర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది.
ట్రైలర్ రిలీజ్
టాలీవుడ్ డైరెక్టర్, బాలీవుడ్ హీరో కలిసి ఓ కొత్త చిత్రం చేస్తున్నారు. బాలయ్య బాబు ‘వాల్తేరు వీరయ్య’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు గోపీచంద్ మలినేని ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ స్టార్ యాక్టర్ సన్నీ డియోల్‌తో ‘జాట్’ మూవీ చేస్తున్నాడు. ఇందులో డియోల్ సరసన సయామీ ఖేర్, రెజీనా కాసాండ్రా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అదే సమయంలో వినీత్ కుమార్ సింగ్, రణదీప్ హుడా, జగపతిబాబు, రమ్యకృష్ణ వంటి నటీ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌లో సన్నీ డియోల్ మాస్ యాక్షన్ అదిరిపోయింది. పవర్ ఫుల్ డైలాగ్స్, ఫుల్ యాక్షన్ మోడ్‌లో ఉన్న ఈ ట్రైలర్ సినీ ప్రియుల్ని ఆకట్టుకుంది.
అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ హిందీ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్ జరుగుతున్నట్లు అర్థం అవుతోంది. ఎందుకంటే ట్రైలర్‌లో తెలుగు బోర్డులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తంగా ఈ ట్రైలర్ మంచి హైప్ క్రియేట్ చేసింది.
(JAAT movie | latest-telugu-news | telugu-news | movie-news)