ప్రైవేట్ వీడియో లీక్ పై స్పందించిన శృతి.. అంతా వాళ్ళే చేశారంటూ కన్నీళ్లు!

తమిళ నటి శృతి నారాయణ్ ప్రైవేట్ వీడియో నెట్టింట వైరల్ గా మారడం చర్చనీయంశమైంది. అయితే తాజాగా ఈ వీడియో పై శృతి స్పందించింది. ''ఇలాంటి AI- వీడియోలను షేర్ చేయడం మీకు ఒక సరదా కంటెంట్ కావచ్చు.. కానీ ఎదుటివారికి అది చాలా కష్టమైనది అని తెలిపారు.

New Update
shruthi narayan

shruthi narayan

Shruthi Narayanan: తమిళ నటి శ్రుతి నారాయణన్ ప్రైవేట్ వీడియో ఆన్‌లైన్‌లో లీక్ అవడం ఇప్పుడు కోలీవుడ్ దుమారం రేపుతోంది. కొంతమంది స్కామర్లు ఆమె ఒంటిపై బట్టలు లేకుండా వీడియో క్రియేట్ చేసి సర్క్యులేట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు పలు వెబ్ సైట్లలో దీనిని షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

శృతి నారాయణ్ పోస్ట్ 

అయితే తాజాగా శృతి కూడా దీనిపై స్పందించారు. ఆ వీడియోను షేర్ చేయడం ఆపేయండి అంటూ రిక్వెస్ట్ చేశారు. ''ఇలాంటి AI- వీడియోలను సులభంగా సృష్టించడం.. షేర్ చేయడం మీకు ఒక సరదా కంటెంట్ కావచ్చు.. కానీ ఎదుటివారికి అది చాలా కష్టమైనది అని తెలిపారు. శృతి తన పోస్టులో ఇలా పేర్కొంది.. ''నా గురించి వైరల్ అవుతున్న వీడియోలను షేర్ చేయడం మీ సరదాగా ఉండొచ్చు.. కానీ నాకు, నా స్నేహితులకు, కుటుంబానికి అది కష్టమైన పరిస్థితి. నేను ఒక అమ్మాయినే.. నాకు ఎమోషన్స్ ఉన్నాయి. మరీ ఇంతగా దిగజారి మారుస్తున్నారు. దయచేసి వీడియోను  వైరల్ చేయడం ఆపేయండి. మీకు మరీ అంతగా కావాల్సి వస్తే.. మీ చెల్లిదో, ప్రేయసి వీడియో చూడండి. వాళ్ళు కూడా అమ్మాయిలే కదా! వారికీ నాలాంటి శరీరమే ఉంటుంది. వారి ప్రైవేట్ వీడియోస్ చూసి ఆనందించండి'' అంటూ గట్టిగా బదులిచ్చింది. 

shruthi narayan post
shruthi narayan post

 చెన్నైకి చెందిన 24 ఏళ్ల శ్రుతి నారాయణన్, తమిళ వినోద పరిశ్రమలో ఇప్పుడిప్పుడే నటిగా గుర్తింపు తెచ్చుకుంటోంది. ప్రముఖ తమిళ సీరియల్ 'సిరగడిక్క ఆసైలో' ఆమె పాత్రకు మంచి పేరు లభించింది. 649 ఎపిసోడ్‌లకు పైగా ప్రసారం అయిన ఈ సిరీస్ వీక్షకులను ఇంకా  ఆకర్షిస్తూనే ఉంది. ఇందులో అనిల శ్రీకుమార్, శ్రీ దేవా,  ఆర్ సుందరరాజన్ వంటి ప్రఖ్యాత నటులతో పాటు శ్రుతి సహాయక పాత్రలో నటించింది. 

telugu-news | cinema-news | latest-news

Also Read: Payal Rajput: నన్ను తొక్కేసారు.. ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే?- పాయల్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Actress Hema: కరాటే కళ్యాణి, తమన్నా సింహాద్రికి నటి హేమ బిగ్ షాక్!

నటి హేమ.. కరాటే కళ్యాణి, తమన్నా సింహాద్రితో పాటు పలు యూట్యూబ్ ఛానెల్స్ కి లీగల్ నోటీసులు పంపింది. గతంలో వీరిద్దరూ తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొంది. తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమైంది.

New Update
hema sent legal notices to kalyani Tamanna simhadri

hema sent legal notices to kalyani Tamanna simhadri

Actress Hema:  టాలీవుడ్ నటి హేమ మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో తనపై అవాస్తవాలు ప్రచారం చేసిన పలు యూట్యూబ్ ఛానెల్స్ కు, పలువురు నటులకు లీగల్ నోటీసులు పంపింది. కరాటే కళ్యాణి, తమన్నా సింహాద్రి తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారని నోటీసులో పేర్కొంది. అంతేకాదు తనను కించపరిచే విధంగా మాట్లాడారని ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వారిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమైంది హేమ. మా ఎన్నికల సమయంలోనూ హేమ.. కళ్యాణి పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నోటీసులకు సంబంధించి ఇప్పటికే తమన్నా.. హేమ లీగల్ టీమ్ తో చర్యలు జరుపుతున్నట్లు సమాచారం. 

ఇది కూడా చూడండి: Actor Darshan Arrest: జడ్జి కుమారుడిపై దాడి.. నటుడు & బిగ్ బాస్ ఫేం కంటెస్టెంట్‌ అరెస్టు

 2023లో కూడా

అయితే  2023లో కూడా హేమ పలు యూట్యూబ్ ఛానెళ్ల పై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన బర్త్ డే పార్టీలో భర్తతో కలిసి ఉన్న ఫొటోలకు ఫేక్ థంబ్ నెయిల్స్ పెట్టి ఇష్టానుసారంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారని వాపోయింది. ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తున్న వెబ్ సైట్స్, యూట్యూబ్ ఛానెళ్ల పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. 

ఇదిలా ఉంటే గతేడాది హేమ బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చిన హేమ.. తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని స్పష్టం చేసింది. ఈ విషయంపై ఆమెను మా అసోసియేషన్ నుంచి తొలగించడం కూడా జరిగింది. కాగా, ఆ తర్వాత నిర్వహించిన రక్త పరీక్షల్లో నెగిటివ్ అని తేలడంతో 'మా' హేమ పై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. 

 telugu-news | latest-news | actress-hema | karate-kalyani | tamanna-simhadri | cinema-news

ఇది కూడా చూడండి: TG Crime : ఏం మనిషివిరా నువ్వు..ఆరోగ్యం బాలేక.. స్నేహితుడిని నమ్మి కూతుర్ని అప్పగిస్తే!

Advertisment
Advertisment