Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ 'ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్' సినిమాతో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. 2018లో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ఊహించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మిశ్రమ స్పందనలు సొంతం చేసుకుంది. ముంబైకి చెందిన అజాతశత్రు లావాష్ పటేల్ అనే వీధి మాంత్రికుడు తన విడిపోయిన తండ్రిని కనుగొనే నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది.
ఇది కూడా చూడండి: Ashwani Kumar : డెత్ ఓవర్ల స్పెషలిస్ట్.. రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!
One extraordinary journey, one unforgettable adventure! 🎩✈️#theextraordinaryjourneyofthefakir coming soon on aha#Dhanush #dhanushmovie #Comingsoon #aha pic.twitter.com/kQmo4G8lhc
— ahavideoin (@ahavideoIN) March 3, 2025
ఆరేళ్ల తర్వాత
కెన్ స్కాట్ దర్శకత్వం వహించిన ఈ అడ్వెంచర్ కామెడీ.. దాదాపు ఆరేళ్ళ తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫారమ్ పై తెలుగులో అందుబాటులో ఉంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ 'ఆహా' లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే కన్నడ, హిందీ, ఇంగ్లీష్ వెర్షన్స్ అందుబాటులో ఉండగా తాజాగా తెలుగులో కూడా రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటె ప్రస్తుతం ధనుష్ తెలుగులో శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న 'కుబేర' చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా మరో కీలక పాత్రను పోషించగా.. కన్నడ బ్యూటీ రష్మిక కథానాయికగా నటిస్తోంది.
cinema-news | The Extraordinary Journey of the Fakir
Also Read: ప్రధాని నుంచి సినీ తారల వరకు అంతా షాకయ్యారు! అసలు 'Adolescence' సీరీస్ లో ఏముంది?