Anupama: ఆ స్టార్ హీరో కుమారుడితో అనుపమ డేటింగ్.. నెట్టింట దర్శనమిస్తున్న ఫొటో?

యువ నటుడు ధ్రువ్‌ విక్రమ్‌‌తో అనుపమ పరమేశ్వరన్ డేటింగ్‌లో ఉన్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. వీరిద్దరు కిస్ చేసుకుంటున్న ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇది మూవీకి సంబంధించిన సీన్ అని కొందరు నెటిజన్లు అంటున్నారు.

New Update
Dhruv & Anupama

Dhruv & Anupama

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌ యువ నటుడు ధ్రువ్‌ విక్రమ్‌‌తో డేటింగ్‌లో ఉన్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. వీరిద్దరు కిస్ చేసుకుంటున్న ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని నెటిజన్లు అంటున్నారు. 

Also Read :  కల్యాణ్‌రామ్‌ ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ ట్రైలర్‌ చూశారా? కెవ్ కేక

సినిమాలోని ఫొటో అని కొందరు..

ఈ ఫొటో సినిమాలోనిదని మరికొందరు అంటున్నారు. ధ్రువ్, అనుపమ కలిసి 'బైసన్' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో అనుపమ ప్రేయసిగా ధ్రువ్‌కి నటిస్తోంది. ఈ సినిమాలోని ఫొటో లీక్ అయి ఉండవచ్చని అంటున్నారు. మరి ఈ విషయంపై అనుపమ, ధ్రువ్, మూవీ టీం కానీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. 

Also Read :  'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!

Also Read :  ట్రెడిషనల్ లుక్ తో కట్టిపడేసిన మిల్కీబ్యూటీ..

Also Read :  'సూర్య 45'లో మలయాళ బ్యూటీ అనఘా రవి

 

dhruv-vikram | anupama-parameswaran | latest-telugu-news | telugu viral news | telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news | latest tollywood updates

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Imanvi Esmail నేను పాకిస్థానీ కాదు.. ప్రభాస్ హీరోయిన్ సంచలన ప్రకటన

ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ పాకిస్థాన్ అమ్మాయని, ఆమెను బ్యాన్ చేయాలని వస్తున్న వార్తలపై ఆమె స్పందించారు. నా కుటుంబంలో ఎవరూ పాకిస్తానీ మిలిటరీతో సంబంధం కలిగిలేరు. నేను గర్వించదగ ఇండోఅమెరికన్. దయచేసి తప్పుడు ప్రచారాలు చేయడం ఆపేయండి అని పోస్ట్ పెట్టింది.

New Update
Actress Imanvi: ప్రభాస్ హీరోయిన్ గా మిలటరీ ఆఫీసర్ కూతురు..! ఎవరీ ఈ బ్యూటీ..?

Fauji Actress Imanvi:  పహాల్గమ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థానీ నటీనటులు మన సినిమాల్లో నటించడానికి, వాళ్ళను ప్రోత్సహించడానికి వీల్లేదని సోషల్ మీడియా పోస్టుల రూపంలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలో ప్రభాస్ ' ఫౌజీ'  హీరోయిన్ ఇమాన్వీ పై తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. ఆమె పాకిస్థానీ మూలాలు ఉన్న అమ్మాయని, అమెరికాలో సెటిల్ అయ్యేముందు ఆమె తండ్రి పాకిస్థాన్ ఆర్మీలో మేజర్ గా పనిచేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో  నెటిజన్లు సినిమా నుంచి ఆమెను బ్యాన్ చేయలాంటు పోస్టులు చేయడం మొదలు పెట్టారు.

నేను పాకిస్థానీ కాదు..  

ఈ నేపథ్యంలో తాజాగా నటి ఇమాన్వీ ఈ వివాదంపై స్పందించింది. తాను పాకిస్థానీ కాదంటూ స్పష్టం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసింది. అలాగే ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తూ మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. 

ఇమాన్వీ పోస్ట్.. 

ఇమాన్వీ తన పోస్టులో ఇలా రాసుకొచ్చింది.. నా కుటుంబానికి సంబంధించి సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ పుకార్లను, అబద్దాలను  నేను పరిష్కరించాలనుకుంటున్నాను.  నా కుటుంబంలో ఎవరూ ఇప్పటివరకు పాకిస్థానీ మిలిటరీతో ఏ విధంగానూ సంబంధం కలిగిలేరు. ద్వేషాన్ని పుట్టించాలనే ఏకైక ఉద్దేశంతోనే ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. నేను లాస్ ఏంజిల్స్ లో పుట్టాను. నా తల్లిదండ్రులు చట్టబద్ధంగా అమెరికాకు యువతగా వలస వచ్చారు. ఆ తర్వాత అమెరికా పౌరులుగా మారారు.  నేను హిందీ, తెలుగు, గుజరాతీ,  ఇంగ్లీష్ మాట్లాడే గర్వించదగిన ఇండోఅమెరికన్  అంటూ క్లారిటీ ఇచ్చింది. కొన్ని పేరున్న వార్త సంస్థలు కూడా నా గురించి కనీస రీసర్చ్ చేయకుండా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయి అంటూ రాసుకొచ్చారు. 

ఇమాన్వీ అమెరికాలోని విశ్వవిద్యాలయంలో తన విద్యాబ్యాసాన్ని పూర్తి చేసినట్లు తెలిపింది. ఆ తర్వాత సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ గా, నటిగా, కొరియోగ్రాఫర్‌గా, పనిచేస్తూ కళల పట్ల తన ఇంట్రెస్ట్ కొనసాగించానని.. ఇప్పుడు భారతీయ చిత్రపరిశ్రమలో పనిచేసే అవకాశం దక్కినందుకు కృతజ్ఞతలు అని తెలిపింది. 

telugu-news | cinema-news | actress-imanvi | Prabhas Fauji | latest-news

Advertisment
Advertisment