/rtv/media/media_files/2025/03/21/IZ1KKMc5VhwlBrQJu176.jpg)
Ananya Nagalla
తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ల ఇండస్ట్రీలో రాణిస్తోంది. వరుస సినిమాలో అదరగొడుతుంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఎంపిక చేసుకుంటూ.. నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఈ వకీల్‌సాబ్ హీరోయిన్ ఇప్పుడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోందని టాక్. ఏకంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రంతో ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఈ చిత్రానికి రాకేష్ జగ్గి దర్శకత్వం వహిస్తుండగా, ఇమ్మత్ లడుమోర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అనన్య ఓ ట్రైబల్ అమ్మాయిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: GT VS SRH: హైదరాబాద్ ఇక ఇంటికి వెళ్ళిపోయినట్లే...వరుసగా నాలుగో ఓటమి
ವಕೀಲ್ ಸಾಬ್ ನಟಿ ಬಾಲಿವುಡ್ಗೆ ಎಂಟ್ರಿ: ಆ ಸಿನಿಮಾಗಳಿಗೆ ಮಾತ್ರ ಬೆಸ್ಟ್ ಚಾಯ್ಸ್, ಏನ್ ಮಾಡ್ತಿದ್ದಾರೆ ಅನನ್ಯಾ?#AnanyaNagalla #Bollywood #LadyOrientedFilm #VakeelSaab https://t.co/65vA00IoUd
— Asianet Suvarna News (@AsianetNewsSN) April 6, 2025
ఇది కూడా చూడండి: Agniveers: అగ్నివీరులకు గుడ్‌న్యూస్.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు
సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలి మరి..
అనన్య నాగళ్ల సాఫ్ట్‌వేర్ జాబ్ వదులుకుని షాదీ అనే షార్ట్ ఫిల్మ్‌తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మల్లేశం సినిమాతో వెండితెరపై కనిపించింది. ఇలా ఆమెకు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్‌లో ఛాన్స్ వచ్చింది. ఈ సినిమాలో అనన్య నటనకు మంచి మార్క్‌లు పడ్డాయి. అప్పటి నుంచి కంటెంట్ ఉన్న సినిమాలు ఎంచుకుంటూ టాలీవుడ్‌లో రాణిస్తోంది.
ఇది కూడా చూడండి: 57ఏళ్ల వయసులో ఇదేం బుద్ధి.. లవర్ తండ్రి అస్థికలతో బ్లాక్‌మెయిల్ ‘వస్తేనే ఇస్తా’
ఇదిలా ఉండగా అనన్య నాగళ్ల సోషల్ మీడియాలో కూాడా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడూ ఫొటోలు షేర్ చేస్తుంటుంది. ఇటీవల రామనవమి సందర్భంగా కూడా ఫొటోలు షేర్ చేసింది. ఈ ఫొటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చూడండి: Jibli Trend: జిబ్లీలో ఫోటోలు అప్ లోడ్ చేస్తున్నారా..అయితే జాగ్రత్త
heroine-ananya-nagalla | actress-ananya-nagalla | Ananya Nagalla | tollywood-actress | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu | telugu-cinema-news | telugu-film-news